BJP అధ్యక్ష పదవి.. రామ్‌చందర్ రావు , ఈటలలో ఒకరికే అవకాశం
బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఎంపీ ఈటల రాజేందర్, మరొకరు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు. వీళ్లిద్దరిలోనే ఒకరికి అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉందని సమాచారం.
బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఎంపీ ఈటల రాజేందర్, మరొకరు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు. వీళ్లిద్దరిలోనే ఒకరికి అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉందని సమాచారం.
జులై 1, 2 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు హాల్ టికెట్లను apdsc.apcfss.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చుని విద్యాశాఖ తెలిపింది. ఈ నియామక పరీక్షలు జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సి ఉండగా, యోగా దినోత్సవం కారణంగా వాయిదా వేశారు.
ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్షం పలువురి ప్రాణాలు తీస్తుంది. తాజాగా సూర్యాపేట జిల్లాలో మరోసారి ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఈ నిర్లక్ష్యం మూలంగా ఓ పసికందు మృతిచెందింది. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
కర్ణాటకలో మరో రెండు, మూడు నెలల్లో డీకే శివ కుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉందని అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. ప్రస్తుతం పార్టీ హైకమాండ్ శివకుమార్ గురించే మాట్లాడుతోందని తెలిపారు.
తెలుగు దేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం అమరావతిలో నిర్వహించారు. దీనికి మొత్తం 15మంది ఎమ్మెల్యేలు హాజరు కావడంతో సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇలా దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చారు.
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పూర్ణచందర్ వేధింపుల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య కు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో సైతం పూర్ణచందర్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు టోక్యో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ సమస్య వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3.33 గంటలకు కోల్‌కతాలోని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేశారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో జూలై 1వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.