/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
BJP
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరవీడనుంది. తాజాగా ఈ నియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు పర్మిషన్ ఉంటుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మంగళవారం కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుంది.
Also Read: చార్‌ధామ్ భక్తులకు బిగ్ అలర్ట్.. మరోసారి యాత్ర వాయిదా!
Telangana Notification For BJP State President
ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ ఎన్నికల అధికారి యెండల లక్ష్మీ నారాయణ వెల్లడించారు. ఇక కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్రమంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారు. ఇదిలాఉండగా తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేదానిపై గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్యే గట్టి పోటీ ఉండనుందని తెలుస్తోంది.
ధర్మపురి అరవింద్‌కు పార్టీ విధేయుడిగా గుర్తింపు ఉంది. బీజేపీ అగ్రనేతలైన మేదీ, అమిత్ షాకు ఈయన సన్నిహితుడు. రాష్ట్రంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా, సూటిగా విమర్శలు చేయడంలో పేరు తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు. రెండుసార్లు నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉండటంతో ఆయనకు అధ్యక్ష పదవి కలిసి వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
Also Read: చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం.. సినిమా లెవెల్‌లో దారుణ హత్య!
ఈటల రాజేందర్ బీసీ నేతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ నాయకుడిగా, ప్రజాదరణ పొందిన నేతగా ఆయనకు పేరుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు ఉంది. అలాగే ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై అవగాహన ఉంది. పార్టీలో చేరినప్పుడు అధిష్ఠానం ఇచ్చిన హామీ కూడా ఆయనకు అనుకూల అంశమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి వీళ్లద్దరిలో ఎవరికి అధ్యక్ష పదవి దక్కుతుందో తెలియాలంటే మంగళవారం వరకు వేచిచూడాల్సిందే.
Also Read: ఉక్రెయిన్‌పై అదిపెద్దదాడి... 477 డ్రోన్లు, 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా...
ఇది కూడా చూడండి: ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
bjp-state-president | rtv-news | telugu-news