Pakistan: భారత్ కు గగనతల నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
భారత్ తో పోరును పాకిస్తాన్ ఇంకా ఆపాలనుకోవడం లేదు. అందుకే భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది.
భారత్ తో పోరును పాకిస్తాన్ ఇంకా ఆపాలనుకోవడం లేదు. అందుకే భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది.
ఇద్దరు ముస్లిం మహిళలు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారి హిందూ పురుషులను వివాహం చేసుకున్నారు. హాపూర్‌లోని ఆర్య సమాజ్ మందిర్‌లో స్వలేహీన్, నూర్ఫాతిమా అనే ముస్లిం మహిళలు హిందూ మతంలోకి మారి హిందూ యువకులను వివాహం చేసుకున్నారు.
ఎప్ట్సీన్ పై ఇచ్చిన నివేదిక నకిలీదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్, రూపర్ట్ ముర్డోక్ కంపెనీ, దాని యజమానులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావా వేశారు. 10 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
పాకిస్థాన్‌లో వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన కుండపోత వర్షాలు, వరదల కారణంగా 63 మంది మరణించగా, 290 మందికి పైగా గాయపడ్డారని NDMA ప్రకటించింది. విద్యుదాఘాతం, భవనాలు కూలిపోవడం, ఆకస్మిక వరదల వల్ల ఈ మరణాలు సంభవించాయి.
విడాకులు తీసుకున్న తన భార్యకు నెలకు రూ.6,000 భరణం చెల్లించడానికి ఓ భర్త దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది. నిరుద్యోగి అయిన ఈ దొంగ చైన్ స్నాచింగ్‌కు దిగాడని పోలీసులు తెలిపారు.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పహల్గాం దాడికి లష్కరే తోయిబాకు ఎటువంటి సంబంధం లేదని..భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది.
డిస్నీ 'ట్రోన్: ఆరెస్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. జారెడ్ లెటో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ట్రైలర్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో గూస్బంప్స్ తెప్పిస్తోంది. అక్టోబర్ 10, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
హైదరాబాద్‌లో నిన్న భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 60-100 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 150 మి.మీ వరకు భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ఏపీలోని కుప్పంలో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో పలు సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగానే ఆ వివాహిత సూసైడ్ చేసుకుందని తెలిపారు. ‘‘నీకు నా కన్నా.. నీ భార్యే ముఖ్యమా?.. నేను చనిపోతున్నా’’ అంటూ రిప్లై ఇచ్చి చనిపోయింది.