BIG BREAKING : పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ ..  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్!

పాలమూరు బిడ్డనైనా తాను పదేళ్ల వరకు సీఎంగా ఉంటానంటూ నాగర్ కర్నూల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.  

New Update
cm-revanth-reddy

పాలమూరు బిడ్డనైనా తాను పదేళ్ల వరకు సీఎంగా ఉంటానంటూ నాగర్ కర్నూల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.  "రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు" అంటూ ఆయన ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు