/rtv/media/media_files/2025/05/22/o48cOgxaOnev3BEAu0YN.jpg)
Pakistan to extend closure of its airspace for Indian flights by another month
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్..పాకిస్తాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధుజలాలను ఆపేసింది. అటారీ సరిహద్దును మూసేసింది. అలాగే గగనతలాన్ని కూడా మూసేసింది. అయితే తరువాత అటారీ సరిహద్దులను తెరిచింది. కానీ సింధు జలాలు, గగనతలాల విషయంలో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. భారత్ చర్యలకు బదులుగా పాకిస్తాన్ కూడ తమ ఎయర్ స్పేస్ ను మూసేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని తెరవలేదు.
ఇప్పుడు మళ్ళీ పొడిగింపు..
తాజాగా గగనతల నిషేధాన్ని మళ్ళీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ నిర్ణయం తీసుకుంది. భారతీయ విమానయాన సంస్థలు నిర్వహించే అన్ని విమానాలకు.. అలాగే లీజుకు తీసుకున్న సైనిక, పౌర విమానాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. జూలై 19న మధ్యాహ్నం 3:50 గంటలకు భారత కాలమానం ప్రకారం అమల్లోకి రానుంది. ఆగస్టు 24న ఉదయం 5:19 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది.
Also Read: USA: వాల్ స్ట్రీట్ జర్నల్ పై ట్రంప్ దావా..10 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం