/rtv/media/media_files/2025/06/29/trump-2025-06-29-15-42-55.jpg)
Trump
2003లో జెఫ్రీ ఎప్ట్సీన్ కు పుట్టిన రోజు కానుకగా ట్రంప్ ఒక మెసేజ్ పంపించారని...అందులో నగ్న మహిళ స్కెచ్, లైంగిక రూపంలో ఉన్న సంతకం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. జెఫ్ట్రీ ఎప్ట్సీన్ బాలల లైంగిక నేరస్థుడు. పిల్లల లైంగిక నేరాలకు పాల్పడిన ఎప్స్టీన్ 2019లో జైలులో మరణించాడు. అతనికి ట్రంప్ వ్యక్తిగతంగా లేఖ రాసారని నివేదించింది. అయితే ట్రంప్ ఆ లేఖ రాయలేదని అన్నారు. అది నకిలీదని ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేసినందుకు గానూ డౌ జోన్స్, న్యూస్ కార్ప్, రూపర్ట్ ముర్డోక్, ఇద్దరు వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టులపై ఫ్లోరిడాలోని సదరన్ డిస్ట్రిక్ట్‌లోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ దావా వేశారు. తన పరువుకు నష్టం కలిగించారని...దురుద్దేశంతోనే ఇదంతా కావాలని చేశారని...దాని వలన తనకు అపారమైన ఆర్థిక నష్టంతో పాటూ ప్రతిష్టకు కూడా భంగం కూడా కలగిందని ట్రంప్ అన్నారు. దీనికిగానూ వాల్ స్ట్రీట్ జర్నల్ తనకు 10 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మయామిలోని సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ఈ దావా వేశారు.
లైంగికారోపణల నిందితుడు..
అమెరికాలో జెఫ్రీ ఎప్ట్సీన్ రిచ్ ఫైనాన్షియర్. ఇతనిపై మొదటసారి 2006లో లైంగిక ఆరోపణలు వచ్చాయి. 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను ఫ్లోరిడాలోని తన ఇంట్లో లైంగిక వేధింపులకు గురిచేశారని కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత జెఫ్రీకు 13 నెలల జైలు శిక్ష విధించారు. కానీ అప్పుడు తప్పించుకున్నాడు. అయితే మళ్ళా డజన్ల కొద్ది బాలికలను అక్రమంగా రవాణా చేసి, డబ్బుకు బదులుగా వారితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని తేలడంతో 2019లో అతనిని మళ్ళీ అరెస్ట్ చేశారు. కానీ కొన్ని రోజులకే ఆగస్టులో ఎప్ట్సీన్ జైలు గదిలో ఉరేసుకుని చనిపోయాడు.
అయితే జెఫ్రీ ఎప్ట్సీన్ తో కలిసి ట్రంప్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేశాక ఎప్ట్సీన్ కు సంబంధించిన ఫైల్స్ ను అణిచివేయాలని ట్రంప్ మద్దతుదారులు చాలా ప్రయత్నాలు చేారు. కానీ అవేమీ వీలు కాలేదు.గత వారం, న్యాయ శాఖ, FBI నుంచి వచ్చిన ఒక మెమో, ఎప్స్టీన్ ఫైల్స్‌లో తదుపరి దర్యాప్తును సమర్థించే ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మెమో రెండు సంస్థల అధిపతులు రాజీనామా చేయాలని తెలిపింది.