/rtv/media/media_files/2025/07/19/pakistan-pm-2025-07-19-07-25-19.jpg)
Pakistan PM
అగ్రరాజ్యం అమెరికా, దాయాది దేశం భారత్ ల మీద పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని అమెరికా ప్రకటించింది. టీఆర్ఎఫ్ ను కూడా ఉగ్రవాది సంస్థగా చెప్పింది. లష్కరే తోయిబాను వెనకేసుకుని వచ్చింది. టీఆర్ఎఫ్ కు దానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. టీఆర్ఎఫ్ ను, ఆ నెట్ వర్క్ ను తాము ధ్వంసం చేసినట్లు తెలిపింది. లష్కరేను సపోర్ట్ చేస్తూనే తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని నీతి వాక్యాలను పలికింది. భారత్ తమపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో తాము ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ ప్రకటనను విడుదల చేసింది.
దర్యాప్తు పూర్తవకుండా నిందలు..
ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడంలో పాకిస్తాన్ చాలా పాటు పడిందని ఆ దేశ విదేశాంగ చెప్పింది. ఉగ్ర సంస్థల నాయకులను అరెస్ట్ చేశామని...వాళ్ళ నెట్ వర్క్ లన్నీ ధ్వంసం చేశామని తెలిపింది. పహల్గాం దాడికి సంబంధించి ఇప్పటికీ దర్యాప్తు పూర్తవ్వలేదు. ఈ లోపునే దానికి లష్కరే తోయిబాకు ముడిపెట్టడం..నిజాలను తప్పుదారి పట్టించడమే అవుతుందని చెప్పింది. ఉగ్రవాదాన్ని తాము ఎప్పటికీ సపోర్ట్ చేయమని...అమెరికా ఇప్పుడు తమ గురించి అలా ప్రకటించడం ప్రపంచం ముందు అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల దురాగతాల నుంచి దారి మళ్లించడానికి, పాక్ వ్యతిరేక ప్రొపగండాను అవలంభించడంలో భారత్‌కు ట్రాక్ రికార్డు విమర్శించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో అంతర్జాతీయ సమాఖ్య నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది.