/rtv/media/media_files/2025/07/19/nagapur-2025-07-19-07-41-07.jpg)
విడాకులు తీసుకున్న తన భార్యకు నెలకు రూ.6,000 భరణం చెల్లించడానికి ఓ భర్త దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది. నిరుద్యోగి అయిన ఈ దొంగ చైన్ స్నాచింగ్‌కు దిగాడని పోలీసులు తెలిపారు. మన్కాపూర్‌లోని గణపతినగర్ నివాసి అయిన 28 ఏళ్ల కన్హయ్య నారాయణ్ బౌరాషిగా గుర్తించిన పోలీసులు ఓ దోపిడీ కేసు దర్యాప్తులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 22న మనీష్‌నగర్‌లో బైక్‌పై వచ్చిన దొంగ కన్హయ్య జయకుమార్ గడే అనే 74 ఏళ్ల వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును దోచుకుని పరారయ్యాడు.
కోర్టు ఆదేశాల మేరకు
వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన చేయడంతో బెల్టరోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీంతో పోలీసులు కన్హయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను అలాంటి నాలుగు దొంగతనాలకు పాల్పడ్డాడని తేలింది. తన మొదటి భార్యకు కోర్టు ఆదేశాల మేరకు నెలకు రూ. 6,000 చెల్లించడానికి తాను దొంగతనాలకు పాల్పడినట్లు కన్హయ్య వెల్లడించాడు.
కన్హయ్య కొట్టేసిన బంగారాన్ని శ్రీ సాయి జ్యువెలర్స్ యజమాని అమర్‌దాస్ నఖతేకు అప్పగించి డబ్బుగా తీసుకునేవాడు. అతను సాక్ష్యాలను మాయంల చేయడానికి దొంగిలించిన బంగారాన్ని ఒక ముద్దగా కరిగించాడని దర్యాప్తులో తేలింది. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, రూ. 1.85 లక్షల విలువైన 10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.