Uttar Pradesh: మతం మారిన ముస్లిం మహిళలు.. హిందూ పురుషులతో పెళ్లి-VIDEO

ఇద్దరు ముస్లిం మహిళలు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారి హిందూ పురుషులను వివాహం చేసుకున్నారు. హాపూర్‌లోని ఆర్య సమాజ్ మందిర్‌లో స్వలేహీన్, నూర్ఫాతిమా అనే ముస్లిం మహిళలు హిందూ మతంలోకి మారి హిందూ యువకులను వివాహం చేసుకున్నారు.  

New Update
uttar-pradesh-marriage

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఇద్దరు ముస్లిం మహిళలు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారి హిందూ పురుషులను వివాహం చేసుకున్నారు. హాపూర్‌లోని ఆర్య సమాజ్ మందిర్‌లో స్వలేహీన్, నూర్ఫాతిమా అనే ముస్లిం మహిళలు హిందూ మతంలోకి మారి హిందూ యువకులను వివాహం చేసుకున్నారు.  మతం మారిన తర్వాత స్వలేహీన్ తన పేరును షాలినిగా మార్చుకుని అమిత్ కుమార్‌ను వివాహం చేసుకుంది, నూర్ఫాతిమా నీలంగా పేరు మార్చుకుని గౌరవ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

కుటుంబ సభ్యుల నుండి బెదిరింపులు

షాలిని (గతంలో స్వాలెహీన్) తాను టర్కిష్ సమాజానికి చెందినదానినని, ఎటువంటి ఒత్తిడి లేకుండా తన స్వంత ఇష్టానుసారం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.  ఆమె దీనిని ఆధ్యాత్మిక ఎంపికగా అభివర్ణించింది, అయితే ఈ నిర్ణయం వలన తమ కుటుంబ సభ్యుల నుండి తమకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ, షాలిని, నీలం ఇద్దరూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మొరాదాబాద్ జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు