🔴Live Breakings: క్యాన్సర్ తో పోరాడుతూ ప్రముఖ నటుడు కన్నుమూత!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పార్టీ అధిష్ఠానం నోటీసులు ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచుతానని హెచ్చరించాడు.
వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ సేఫ్ జోనుకు తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్పార్క్లోకి అడుగుపెట్టినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో అభయారణ్యంపై ఆపరేషన్ మొదలుపెట్టాయి.
నోటీసుల్లో పేర్కొన్న విధంగా ఈ నెల 5న తాను విచారణకు రాలేనని, 11న వస్తానని కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందించారు. కేసీఆర్ వినతికి కమిషన్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న హరీష్ రావు విచారణ ఆధారంగా KCR తదుపరి నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.
మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ఛత్తీష్‌గఢ్ లో 16మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇద్దరు PLGA సభ్యులు సహా 14మంది నక్సల్స్ బస్తర్ ఎస్పీకిరణ్ చౌహాన్ ఇతర పోలీసు బలగాల ముందు తమ ఆయుధాలు అప్పగించి సరెండర్ అయ్యారు. వీరిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
KCRను ఎగతాళి చేశారు.. బెదిరించారు.. అవమానించారని.. కానీ, ఆయన ఆత్మబలాన్ని ఎవ్వరూ వంచలేకపోయారని ఆయన మనవడు హిమాన్షు ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని.. మన ఆత్మగౌరవానికి చిహ్నమన్నారు. చరిత్ర ఎప్పటికీ మరిచిపోని పేరు KCR అని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకులకు జపాన్ నుంచి ప్రత్యేక అతిథి బృందం హైదరాబాద్ వచ్చింది. కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు సమాచారం.
విజయవాడ జగన్, సజ్జలపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జాగన్‌కి, సజ్జల రామకృష్ణారెడ్డికి లేదన్నారు. రౌడీ షీటర్లకు, గంజాయి సరఫరా చేసే వారికి వైసీపీ మద్దతుగా నిలుస్తోందని ఫైర్ అయ్యారు.
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని, కలుస్తదని కొందరు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ ఎమ్మెల్సీ కవితకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై కేసీఆర్ ఇప్పటికే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.