కూటమి పొత్తుతో ఫస్ట్ దెబ్బ నాకే.. ఎంపీ సీటు వదిలేసుకున్నా.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

కూటమి పొత్తు కారణంగా తాను ఎంపీ సీటు కోల్పోయానని.. ఫస్ట్ రాజీపడ్డది తానేనని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. అనకాపల్లి ఎంపీగా తాను భావించానని.. కానీ పొత్తు ధర్మం కోసం వదిలేశానన్నారు.

New Update
Nagababu Janasena MLC Candidate

Nagababu Janasena MLC Candidate

జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి పొత్తులో రాజీపడిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పొత్తు ధర్మంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించిన మరుక్షణమే అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడుగా పోటీ నుంచి తప్పుకున్నానన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పొత్తు ధర్మమే ప్రథమ ప్రాధాన్యతగా నడుచుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో పదవుల పంపకం గురించి మాట్లాడుతున్న వారి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

చాలామంది నేతలు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా అభివర్ణిస్తారన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి వైపు పరిగెడుతున్న ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఆ కోవలోనే తాము ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు నాగబాబు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకూ జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే విషయాన్ని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షిస్తున్నారని తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వం లిక్కర్ నుంచి ల్యాండ్ వరకూ దేనిని వదలకుండా అన్నింటినీ అవినీతి మాయం చేసిందని ఆరోపించారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కనీసం మరొక 15 ఏళ్లకు పైగా తప్పనిసరిగా కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మొదటగా తన పేరు ప్రకటించిన నేపథ్యంలో కొంత కాలం పాటు అనకాపల్లిలో ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టామని గుర్తు చేశారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ అభ్యర్థికి ఆ సీటు కేటాయించడంతో పొత్తు ధర్మానికి అనుగుణంగా తప్పుకున్నట్లు తెలిపారు. తదనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో నియోజకవర్గంలో పని చేయడం ఎంతో అదృష్టంగా భావించానన్నారు. తద్వారా చాలా సంతృప్తి చెందానని అన్నారు. 

Advertisment
తాజా కథనాలు