/rtv/media/media_files/2025/01/03/9VWfJQViVrm1uevGI00W.jpg)
Rythu Bima
Rythu Bima: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా పథకం 2025-26 సంవత్సరానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 14వ తేదీ నుంచి కొత్త బీమా కాలం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ( Agriculture Department ) కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల్లో అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులు ఉన్నారు. 2025-26 ఈ పథకానికి 18 నుంచి 59 ఏళ్లు ఉన్న రైతులు ఈ వారంలో కొత్త దరఖాస్తులు (New applications) చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. అర్హులు ఉన్న దరఖాస్తుల వివరాలు ఆగస్ట్ 9లోగా గుర్తించి రైతు బీమా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
కొత్తగా అర్హులైన..
గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ( Pass books) పొందిన రైతుల వివరాలను ఏఈఓలు సేకరించారు. ఏఓలు, వ్యవసాయ శాఖ అధికారులు బీమాకు అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియను చేపట్టారు. క్షేత్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు, ఏఓ, జిల్లా స్థాయి అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఖరారు చేస్తారు. రాష్ట్రంలో గతంలో అర్హత ఉన్నప్పటికీ.. ఏడు లక్షలకు పైగా రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు. వారికి సైతం ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ అనుమతించింది. ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి, గతంలో అర్హులై.. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు సుమారు రెండు లక్షల మంది ఉండవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీకి దమ్ము, నిజాయితీ ఉంటే.. కేటీఆర్ సంచలన సవాల్!
గత ఏడాది రైతు బీమా ఉన్న రైతుల రెన్యూవల్స్‌కు సంబంధించిన డేటాను జూలై 30 నాటికి పరిశీలించారు. గత ఏడాది రైతు బీమా ( Rythu Bima)పరిధిలో ఉన్న వారిలో 60 ఏళ్లు నిండిన వారిని మినహాయించి.. 45 లక్షల మందికి పైగా అర్హులైన రైతులకు బీమా రెన్యూవల్ చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. ఈ రెన్యూవల్ అప్‌లోడ్ ప్రక్రియను ఏఈఓలు రైతు బీమా పోర్టల్‌లో పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం.. పాత రెన్యూవల్స్‌తోపాటు కొత్తగా అర్హులైన (Newly eligible) వారితో కలిపి 48 లక్షల మందికి పైగా రైతులకు బీమా చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ఒక్కో రైతుకు బీమా ప్రీమియం కింద ప్రభుత్వం ఎల్ఐసీకి రూ. 3,600 చెల్లించింది. ఈ సంవత్సరం ప్రీమియం ఎంత అనేది త్వరలో నిర్ణయించబడుతుంది. రైతు బీమా పొందిన రైతు దురదృష్టవశాత్తు సహజంగా లేదా మరేదైనా కారణంతో మరణించినట్లయితే..వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందుతుంది. ఈ పథకం ద్వారా రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.
ఇది కూడా చదవండి: దానంతో పాటు ఆ ముగ్గురు MLAలపై అనర్హత.. మిగతా ఏడుగురు సేఫ్?
( Latest News | telugu-news)