/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
Satyapal Malik Death:
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) కన్నుమూశారు. చాలా రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేశారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Former J&K Governor Satyapal Malik passes away at Delhi's Ram Manohar Lohia Hospital after a prolonged illness, confirms his PS, KS Rana. pic.twitter.com/4fwS7Z5Qv6
— ANI (@ANI) August 5, 2025
సత్యపాల్ మాలిక్(Satyapal Malik) 1946 జూలై 24న ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని హిసావాడ గ్రామంలో జన్మించారు. ఆయనది జాట్ కుటుంబం. మీరట్ విశ్వవిద్యాలయం నుండి సైన్స్, ఎల్‌ఎల్‌బిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు మాలిక్. విద్యార్థి దశ నుంచి ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 1968-69లో మీరట్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1974-77 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. 1980-1986, 1986-89 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
Also Read: ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!
లోక్‌దళ్‌ను వదిలి కాంగ్రెస్‌లోకి..
చౌదరి చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్‌దళ్ పార్టీ 1980లో సత్యపాల్ మాలిక్(Satypal Malik)ను రాజ్యసభకు నామినేట్ చేసింది. 1984లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ ఆయనను 1986లో రాజ్యసభకు పంపించింది.1987లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వీపీ సింగ్ చెంతకు చేరారు. 1989లో అలీఘర్ నుండి జనతాదళ్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1990లో కొంతకాలం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
2004లో మాలిక్ బీజేపీలో చేరారు. బాగ్‌పత్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగి నాటి ఆర్‌ఎల్‌డి చీఫ్ అజిత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. మోదీ ప్రభుత్వం మొదటి సారి ఏర్పడిన తర్వాత భూసేకరణ బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ బృందానికి నాయకత్వం వహించడానికి మాలిక్‌ను నియమించింది. బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ప్యానెల్ అనేక సిఫార్సులు సూచించింది. అనంతరం కశ్మీర్ గవర్నర్ గా ఆయనను నియమించింది.
ఆగస్టు 2018 నుండి అక్టోబర్ 2019 వరకు జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చివరి గవర్నర్‌గా ఉన్నారు. ఆయన పదవీకాలంలోనే 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ను మోదీ సర్కారు రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను కూడా ఆ సమయంలోనే రద్దు చేశారు. ఈ నిర్ణయం తీసుకుని నేటికి ఆరేళ్ల అయ్యాయి. ఇదే రోజు సత్యపాల్ మాలిక్ తుది శ్వాస విడిచారు.
అక్టోబర్ 2017- ఆగస్టు 2018 మాలిక్ బీహార్ గవర్నర్‌గా కూడా పని చేశారు. ఒడిశా గవర్నర్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన తర్వాత సత్యపాల్ మాలిక్ గోవా 18వ గవర్నర్‌గా నియమితులయ్యాడు. అక్టోబర్ 2022 వరకు మేఘాలయ 21వ గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు.