/rtv/media/media_files/2025/08/04/sudha-ramakrishnan-2025-08-04-11-28-54.jpg)
Sudha Ramakrishnan
MP Sudha Ramakrishnan: మార్నింగ్ వాక్ చేస్తుండగా తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ మెడలోని గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాకెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని చాణిక్యపూరి సమీపంలో అత్యంత భద్రత కలిగిన విదేశీ రాయబారులు ఉండే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఈరోజు ఉదయం ఎంపీ సుధా రామకృష్ణన్ మరో ఎంపీ మహిళా రజినీతో కలిసి వాక్ కోసం వెళ్లారు. ఇద్దరూ కలిసి వాకింగ్ చేస్తుండగా ఇంతలో అటుగా స్కూటీ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలోని చైన్ లాక్కొని పారిపోయాడు. ఈ సమయంలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఆ దొంగ ముఖానికి మాస్క్ ధరించి ఉండటంతో ఆమె గుర్తించలేకపోయారు. ఈ ఘటనపై కేసు పై నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా దొంగను పట్టుకునే పనిలో ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ఎంపీకి ఇలాంటి సంఘటన జరగడం ఢిల్లీలో భద్రతపై ఆందోళనలు లేవనెత్తుతోంది.
#BREAKING: Congress MP Sudha Ramakrishnan's chain was snatched this morning in Delhi’s Chanakyapuri area. The MP resides at Tamil Nadu Bhawan. Delhi Police has registered a case and further investigation is underway pic.twitter.com/XlRcnyz38A
— IANS (@ians_india) August 4, 2025
అమిత్ షాకు ఎంపీ సుధా రామకృష్ణన్ లేఖ
ఈమేరకు ఎంపీ సుధా రామకృష్ణనన్ ఢిల్లీలోని శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తనపై జరిగిన చోరీ ఘటనను వివరిస్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎంపీ సుధా లేఖలో ఇలా రాశారు.. ''ఆగస్టు 4, 2025 సోమవారం ఉదయం 6:15 నుంచి 6:20 గంటల మధ్యలో ఢిల్లీలోని పోలాండ్ ఎంబసీ గేట్ 3, 4 సమీపంలో నేను వాకింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. స్కూటీ పై వచ్చిన ఒక వ్యక్తి ముఖానికి పూర్తిగా హెల్మెట్ ధరించి నా బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. గొలుసు లాగే క్రమంలో నా మెడకు స్వల్ప గాయం కూడా అయ్యింది! సహాయం కోసం కేకలు వేశాను అంటూ వాపోయారు.
''ఈ దాడి తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు నాలుగు సవర్లకు పైగా ఉన్న తన బంగారు గొలుసును కోల్పోయానని చెప్పారు. ఢిల్లీలోని అత్యంత భద్రత, రక్షణ కలిగిన ఇలాంటి హై సెక్యూరిటీ జోన్ లో ఒక ఎంపీ పై దాడి జరగడం దిగ్బ్రాంతికరంగా ఉందని అన్నారు. ఈ దాడి తనను చాలా బాధించిందని వాపోయారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని, ఢిల్లీలో ప్రజల భద్రతను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సుధా రామకృష్ణన్'' హోంమంత్రిని కోరారు.
Also Read: Rythu Bima: తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా