BIG BREAKING: అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నా.. కేసీఆర్ సంచలన ప్రకటన!

తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్య నేతలతో ఆయన చర్చించారు. కొంతమంది BRS నేతలను అరెస్ట్ చేయవచ్చని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

New Update
KCR

త్వరలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది BRS నేతలను అరెస్ట్ చేయవచ్చని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు గంటలుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చిస్తున్నారు. ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: సీఎం రేవంత్ ఫోన్ కాల్ లీక్ చేసిన కోమటిరెడ్డి.. వైరల్ గా మారిన సంభాషణ!

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ కమిషన్ రిపోర్ట్ ఊహించిందేనని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరం రిపోర్ట్ పై కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని అన్నారు.   

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించింది. ఈ రిపోర్టుకు సంబంధించిన వివరాలు ఈ రోజు మీడియాకు లీక్ అయ్యాయి. ప్రధానంగా అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ ప్రాజెక్ట్ లో లోపాలకు ప్రధాన కారణమని రిపోర్ట్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయం ప్రకారమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణమంతా కొనసాగిందని కమిషన్ తన రిపోర్ట్లో పేర్కింది. నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించవద్దని స్పష్టం చేసిందని.. కానీ నాటి ప్రభుత్వం కావాలనే ఆ రిపోర్టును తొక్కిపట్టిందని కమిషన్ తెలిపింది. 

కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ తో పాటు అప్పటి అధికారులు స్మితా సభర్వాల్, మురళీధర్ రావు తదితరులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వెల్లడించారు. ఈ కమిషన్ రిపోర్టు ను చర్చించేందుకు నేడు తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సమావేశంలో కాళేశ్వరం రిపోర్ట్ పై సుధీర్ఘంగా చర్చించనున్నారు. ముందుగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్ లేవనెత్తిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు