/rtv/media/media_files/2025/08/08/pulivendula-zptc-elections-2025-08-08-18-24-16.jpg)
వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా చెప్పబడే కడప జిల్లాలో.. అందులో జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నిక ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ విజయం సాధించి తమకు తిరుగులేదని అధికార టీడీపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ తమ కంచుకోటను కాపాడుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుతోంది. పులివెందులలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలో ఉన్నారు. వైసీపీ తమ అభ్యర్థిగా హేమంత్ రెడ్డిని పోటీలో నిలిపింది. వీరితో పాటు మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గెలుపుకోసం కడప ఎంపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందుండి ప్రచారం నడిపిస్తున్నారు. జిల్లాలోని ఇతర ముఖ్య నేతలతో కలిసి ఆయన ప్రతీ గ్రామం తిరుగుతున్నారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: పులివెందులలో ఏం జరుగుతోందంటే?.. వై.ఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు!
పులివెందుల భవిష్యత్తు కోసం… అభివృద్ధికి ఓటు వేయండి!
— Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) August 7, 2025
ఈ నెల 12వ తేదీన జరగబోయే ZPTC ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి, పులివెందల ఇంచార్జ్ బి.టెక్ రవి గారి సతీమణి మారెడ్డి లతా గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరుతున్నాను.
ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వ… pic.twitter.com/ux70ae4ZiW
టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి, బీటెక్ రవి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వీరితో పాటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ జడ్పీటీసీ పరిధిలో 6 పంచాయతీలు ఉండగా.. మొత్తం 10, 400 ఓటర్లు ఉన్నారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మండలం నుంచి దాదాపు 6 వేల ఓట్లు పోలవ్వగా.. టీడీపీకి 2166 ఓట్లు వచ్చాయి. దీంతో అధికార టీడీపీ ఈ సారి పై చేయి సాధిస్తుందా? వైఎస్ ఫ్యామిలీ తమ పట్టును నిలుపుకుంటుందా? అన్న అంశం ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి:Crime : మాజీ జనసేన పార్టీ నేత వినుత కోట కు బెయిల్..కానీ, ప్రతిరోజు..
ఎన్ని ఇబ్బందులు పెట్టినా💥🔥
— Sagar Reddy (@Sagar_YSJ) August 7, 2025
పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 🔥
ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు pic.twitter.com/ITmlD0hGjE
తీవ్ర ఘర్షణ వాతావరణం..
ఇదిలా ఉంటే ఇప్పటికే పులివెందులలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. ప్రతీ గ్రామంలో సిబ్బందిని మోహరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ముఖ్య నేతలు ప్రచారానికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.