/rtv/media/media_files/2025/05/04/GjWTBtBWB6UfEbXtWmtq.jpg)
Neet Ug Exam
NEET Score Scam:
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ (NEET UG 2025) ఫలితాలు విడుదలయ్యాయి. మే 4న జరిగిన నీట్ (యూజీ) పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేశారు. తాజాగా ఫలితాలను ప్రకటించారు. ఇదిలా ఉండగానే ముంబైలో నీట్ స్కోర్ బాగోతం వెలుగు చూసింది. నీట్ స్కోర్‌లను తారుమారు చేసి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. నీట్ స్కోరును తారుమారు చేస్తామంటూ ఇద్దరూ తల్లిదండ్రుల నుంచి రూ. 90 లక్షల వసూలు చేసినట్లు తెలిసింది. విషయం తెలియగానే డబ్బులు వసూలు చేసిన ఇద్దరినీ సీబీఐ నాటకీయ పక్కీలో అదుపులోకి తీసుకుంది. నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్, నవీ ముంబైకి చెందిన సందీప్ షా, సలీం పాటిల్ గా గుర్తించారు.
Also Read: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కల్పిత అధికారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పిన వారిద్దరూ తల్లిదండ్రులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేశారని తేలింది. నీట్ యూజీ 2025లో తక్కువ స్కోర్ సాధించిన అభ్యర్థుల మార్కులను తారుమారు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు బాధితులు నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది.
Also Read: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!
కాగా విషయం తెలియగానే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నాటకీయ పక్కీలో అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తొలుత తల్లిదండ్రులుగా నటించి లోయర్ పరేల్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు నిందితుడు సందీప్ షాను రప్పించారు. ఈ సందర్భంగా మార్కులు తారుమారు చేయాలంటే రూ.90 లక్షలు అవుతాయని వెల్లడించాడు. అయితే అంత ఇచ్చుకోలేమన్న తల్లిదండ్రులు బేరసారాలు మాట్లాడి చివరికి ఒక్కో అభ్యర్థికి రూ.87.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
Also Read: ఇచ్చిన అప్పు అడిగితే జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమాన
ఒప్పందం ప్రకారం నీట్ పరీక్షలో అర్హత సాధించడానికి కావలసిన స్కోరును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులతో సహాయంతో ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటన అంతా రికార్డు చేసిన సీబీఐ అధికారులు సందీప్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. సందీప్ ఇచ్చిన సమాచారంతో సలీం పటేల్, జావేద్ అలీ పటేల్ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం సలీం, సందీప్ షాను అరెస్ట్ చేసిన సీబీఐ జావేద్ అలీ పటేల్ కోసం అన్వేషిస్తోంది.
Also Read: ఏపీలో దారుణం.. తమ్ముణ్ణి వేట కొడవలితో నరికి చంపిన అన్న