Squid Game 3: నెట్ ఫ్లిక్స్ పాపులర్ సీరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 నుంచి ఫైనల్ గేమ్ ట్రైలర్ వచ్చేసింది. మనం ఆడేది ఆట మాత్రమే కాదు అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ఇందులో ప్లేయర్ సియోంగ్ గి-హున్ తన అంతర్గత భయాలతో పోరాడుతూ, అత్యంత ప్రమాదకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కనిపించింది. అలాగే గతంలో జరిగిన సంఘటనలు అతడిని వెంటాడుతుండగా, సియోంగ్ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు. మొదటి సీజన్ లో చనిపోయిన ఆటగాళ్ల జ్ఞాపకాలు ప్లేయర్ 456 పడిన బాధలను గుర్తుచేస్తాయి. ఫుల్ యాక్షన్ నుంచి భావోద్వేగాల వరకు 'స్క్విడ్ గేమ్ 3' ఫైనల్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఫైనల్ గేమ్ ఎపిసోడ్ ఈనెల 27 ఉంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read:Manchu Lakshmi: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్
ఫైనల్ గేమ్ ట్రైలర్
"Are you blaming yourself for everything that's happened?"
— Netflix (@netflix) June 13, 2025
Squid Game 3 concludes June 27. pic.twitter.com/gR0S46gvHk
Also Read: Allu Arjun: 'సూపర్ హీరో' గా అల్లు అర్జున్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకే!