/rtv/media/media_files/2025/04/25/jRSrRJzBFGd1DDsqch2F.jpg)
Jammu Kashmir
రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు సమాచారం.
Also Read:BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
జమ్మూ కశ్మీర్ లో పని చేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లినవారే.దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్ ల నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.
మరోవైపు కశ్మీరీ పండిట్‌ల లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.వీరితో పాటు శ్రీనగర్,గాందెర్బల్ జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉదన్న వార్తల నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.
రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
jammu-kashmir | jammu kashmir attack | latest-news | latest-telugu-news | latest telugu news updates | attack in Pahalgam | Pahalgam attack | army