/rtv/media/media_files/2025/04/25/rBWxHyzPYRecbDA9bPuq.jpg)
పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియా, పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. పర్వతాలు, భూతల లక్ష్యాలను దాడి చేసే సామర్థ్యాలపై దృష్టి పెట్టింది. ఈ ఎక్సర్సైజ్‌లో రాఫెల్ యుద్ధ వివానాలు పాల్గొన్నాయి. పంజాబ్‌లోని అంబాలా, పశ్చిమ బెంగాల్ హషిమారాలో వైమానిక దళం రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లను మోహరించింది. ఇందులో లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడుల వంటి వాటిని నిర్వహించాయి. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన కీలక ఆస్తులు పలు వైమానిక స్థావరాల నుంచి తూర్పు వైపుగా తరలించినట్లు తెలుస్తోంది.
Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి
🇮🇳 "INDIA WARNS PAKISTAN"
— WORLD AT WAR (@World_At_War_6) April 24, 2025
The Indian Air Force (IAF) conducted exercise Aakraman (Attack), a large-scale operational drill across the central sector, showcasing its frontline fighter fleet led by the Rafale jets.
The IAF operates two Rafale squadrons, stationed at Ambala in… pic.twitter.com/jFYfcQd4QW
రఫెల్ ఫైజర్ జెట్లు సరిహద్దు ప్రాంతాలకు చాలా దగ్గరగా ప్రయాణించాయని తెలుస్తోంది. వైమానిక హెచ్చరిక మరియు నియంత్రణ వ్యవస్థ (AWACS) అమర్చిన విమానాలు శత్రువుల కదలికలపై నిఘా ఉంచాయి. అదే సమయంలో, పాకిస్తాన్ వైమానిక దళ జెట్‌లు కూడా సరిహద్దు దాటి ఎగురుతూ కనిపించాయి. ఇండియన్ నేవీ కూడా గురువారం ఐఎన్ఎస్ సూరత్‌కు చెందిన ఓ క్షిపణి పరీక్షను విజయవంతం చేసింది. పాక్ సరిహద్దులో కరాచీ దగ్గర పాకిస్తాన్ కూడా ఉపరితలం నుంచి ఉపరితలంపై ప్రయాణించే ఓ మిస్సేల్ టెస్ట్ నిర్వహించింది. ఇలా ఇరు దేశాలు సైనిక బలాబలాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితులు యుద్ధం రాబోందుంతా అనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
Indian Air Force to launch Exercise Aakraman in the Central Theater 🇮🇳✈️
— Prakash (@Prakash20202021) April 25, 2025
Featuring Su-30MKIs & Rafales, the drill will sharpen ground attack, precision strike & electronic warfare capabilities—boosting joint ops & combat readiness in high-threat scenarios.#IAF #Aakraman pic.twitter.com/e4VP9MolYM
( loc | indian-air-force | Exercise Aakraman | attack in Pahalgam | Pahalgam attack | pakistan | india | latest-telugu-news)