Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

కొమురం భీం జిల్లా జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన చత్రుషావ్ ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టాడు. ఒక యువతితో నాలుగేళ్లు.. మరో యువతితో ఏడాది పాటు ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం తెలిసి ఇద్దరు యువతులు అతడ్నే పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చారు.

New Update
telangana young man

telangana man married two young women

తెలంగాణలో విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించిన ఓ యువకుడు.. ఇద్దరినీ ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..  

ఇద్దరు యువతులతో ప్రేమ

కొమరంభీం జిల్లా జైనూరు మండలానికి చెందిన రంభబాయి-బాద్రుషావ్ దంపతులు అడ్డెసర గ్రామంలో నివాసముంటున్నారు. వీరి రెండో కుమారుడు ఆత్రం చత్రుషావ్ గతకొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. 
ఇక ఆమెతో పాటు కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన బంధువైన మరో యువతిని సైతం ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. అయితే 15 రోజుల క్రితం ఆమెతో పెళ్లి చూపులు జరిగాయి. ఈ విషయం మొదటి యువతికి తెలియడంతో ఆమె రాయి సెంటర్‌ను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
దీంతో ముగ్గురు ఫ్యామిలీలు అక్కడకు చేరుకోవడంతో పరిష్కారం దొరికింది. ఇద్దరు అమ్మాయిలూ తమ ప్రేమికుడు చత్రుషావ్‌ని పెళ్లి చేసుకుంటామని రాయి సెంటర్ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకున్నారు. దీంతో పెళ్లి పత్రికలు ముద్రించి ఒకే మండపంలో వివాహం చేసుకున్నారు.
marriage | latest-telugu-news | telugu-news | telangana
Advertisment
తాజా కథనాలు