Sonia Gandhi: సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ షాకింగ్ రియాక్షన్

రాష్ట్రపతి ప్రసంగంపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దేశంలో అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా సోనియా ప్రవర్తించారంటూ మండిపడింది.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని హితువుపలికింది.

New Update
Rastrapathi Bhavan, Draupadi Murmu and Sonia Gandhi

Rastrapathi Bhavan, Draupadi Murmu and Sonia Gandhi

Sonia Gandhi: బడ్జెట్‌ సమావేశాల్లో(Budget Sessions) భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం(Rastrapathi Bhavan) స్పందించింది. దేశంలో అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా సోనియా ప్రవర్తించారంటూ మండిపడింది. ఇలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపింది.   

Also Read: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?

రాష్ట్రపతి ప్రసంగం చేసేటప్పుడు అలసిపోయారని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆమె అలసిపోలేదు. అణగారిన వర్గాలు, రైతులు, మహిళల కోసం మాట్లాడేటప్పుడు ఆమెకు అలసట రాదు. రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన వారికి భారతీయ భాష, యాసలతో పరిచయం ఉండకపోవచ్చు. అందుకే వాళ్లకు రాష్ట్రపతి అలసిపోయిట్లు అనిపించి ఉండొచ్చు. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్నవారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని'' రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో రాసుకొచ్చింది.  

సోనియాగాంధీపై బీజీపీ(BJP) ఆగ్రహం..

ఇదిలాఉండగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో(Parliment Budget Sessions) భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ప్రసంగం అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారని వ్యాఖ్యానించారు. సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయాయి. దీంతో బీజీపీ(BJP) సోనియాగాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Read: అలా చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తా.. ట్రంప్ హెచ్చరిక

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలు ఇలా మాట్లాడకూడదని బీజపీ ఎంపీ సుకంతా మజుందార్ మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించే అలా మాట్లాడకూడదంటూ హితువు పలికారు. ఆదివాసి కుటుంబం నుంచి వచ్చి ద్రౌపతి ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ జమిందారీ మైండ్‌సెట్‌ ఈ విషయాన్ని అంగీకరించడంలేదంటూ విమర్శించారు. అందుకే ముర్ము ప్రసంగాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UN: పాకిస్తాన్ ది అంతా నాటకమే..యూఎన్ లో విరుచుకుపడ్డ భారత్

ఉగ్రవాదులను తమ పౌరులుగా మర్యాదలు చేసే పాకిస్తాన్ కు ప్రజల ప్రాణాల గురించి మాట్లాడే హక్కు లేదని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చలో ఈ వ్యాఖ్యలను చేసింది. 

New Update
UN

India In UN

ఎంత చెప్పినా పాకిస్తాన్ కాశ్మీర్ అంశం గురించి మాత్రం మాట్లాడుతూనే ఉంది. భారత్ తో చర్చ కాకుండా అన్నిచోట్లా నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. ఐక్యరాజ్యసమితిలో పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటూ ఈ మధ్య కాలంలో భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న  ఉద్రిక్తతల గురించి మాట్లాడారు. దీనికి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. అసలు పాకిస్తాన్ కు మాట్లాడే హక్కు లేదని కూడా చెప్పింది. 

లోపల ఉగ్రవాదంతో సహవాసం..పైకి సూక్తులు..

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ మాట్లాడుతూ...పాకిస్తాన్ అనవసరంగా మాట్లాడుతోందని అన్నారు. భారత్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని అన్నారు.  ఎప్పటి నుంచో భారత్ ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రజల్లా పెంచిపోషిస్తోంది. అలాంటి  వారికి అసలు మాట్లాడే హక్కు ఎక్కడ నుంచి వస్తుందని హరీశ్ విరుచుకుపడ్డారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. కానీ పాకిస్తాన్ ఏం చేసింది..ఈ దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్‌ ప్రభుత్వ, పోలీసు, సైనిక అధికారులు హాజరై నివాళులర్పించారు. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు అని హరీశ్ అన్నారు. 

పాకిస్తాన్ ది అంతా కపటత్వమని..చేసినదంతా చేసి ఇప్పుడు సూక్తులను వెల్లడిస్తోందని హరీశ్ విమర్శించారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఘర్షణల సమయంలో కూడా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకొందని తెలిపారు. వీటిల్లో 20 మందికి పైగా మృతి చెందారు...80 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాఖ్య కలిసి పోరాడాలని...వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ పిలుపునిచ్చారు.

today-latest-news-in-telugu | un | india | pakistan | terrorism

Also Read: Germany: జర్మనీలో రెచ్చిపోయిన దుండుగురాలు..రైల్వే ఫ్లాట్ ఫామ్ లో దాడి..17 మందికి గాయాలు

Advertisment
Advertisment
Advertisment