Trump: అలా చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తా.. ట్రంప్ హెచ్చరిక

డొనాల్డ్ ట్రంప్.. బ్రిక్స్ దేశాలనుద్దేశించి మాట్లాడారు. అమెరికా డాలర్ విలువను తగ్గించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పనులు చేస్తే బ్రిక్స్‌కూటమిలో ఉన్న దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానంటూ తేల్చిచెప్పారు.

New Update
Donald Trump

Donald Trump

 అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన బ్రిక్స్ దేశాలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా డాలర్ విలువను తగ్గించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పనులు చేస్తే బ్రిక్స్‌కూటమిలో ఉన్న దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానంటూ తేల్చిచెప్పారు. '' బ్రిక్స్‌ కరెన్సీని ఇతర దేశాలు సృష్టించలేవు. శక్తివంతమైన అమెరికా డాలర్‌ను భర్తీ చేయడం సాధ్యం కానిపని. ఇలాంటివి జరిగితే 100 శాతం టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Also Read: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?

డాలర్‌ వాడకాన్ని తగ్గించేందుకు యత్నించే ఏ దేశంపైనైనా 100 శాతం సుంకాలు విధించేందుకు వెనకడుగు వేయం. రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, బ్రెజిల్ తో కూడిన ఇంటర్‌ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బ్రిక్స్‌.. అంతర్జాతీయ వ్యాపారం కోసం అమెరికా డాలర్‌ ప్రత్యామ్నాయలపై చర్చలు జరపుతున్నాయి. సుంకాలు ఆహ్వానించాలనుకుంటే అమెరికాకు వీడ్కోలు చెప్పవచ్చని'' ట్రంప్ అన్నారు.   

Also Read: సిరియా పై విరుచుకుపడిన అమెరికా..మోస్ట్‌ వాటెండ్‌ సీనియర్‌ ఉగ్రవాది హతం!

ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. అమెరికా డాలర్ నుంచి వెళ్లిపోవాలనే ఆలోచన లేదన్నారు. బ్రిక్స్ కరెన్సీ కోసం ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం యూఎస్ డాలర్ ప్రపంచ వాణిజ్యంపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రపంచంలో 90 శాతం కంటే ఎక్కువగా లావాదేవీలు కలిగి ఉంది. యూఎస్ డాలర్ తర్వాత జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్ లాంటి ఇతర కరెన్సీలు ఉన్నాయి. అయితే వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు.. కేవలం ఒకే కరెన్సీపై ఆధారపడకుండా ఉండేందుకు బ్రిక్స్ కరెన్సీ ప్రత్యామ్నాయంగా ఉండాలని పలు దేశాలు కోరుతున్నట్లు తెలుస్తోంది.  

Also Read: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

Also Read: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు