Maha Kumb Mela: చనిపోయిన పేరెంట్స్ కు కుంభమేళాలో స్నానం.. ఆ కూతురు ఏం చేసిందంటే!-VIDEO VIRAL

ఓ మహిళ ప్రయాగ్‌రాజ్‌ వద్ద జరిగే కుంభమేళాలోచనిపోయిన తల్లిదండ్రుల ఫొటోలకు పుణ్యస్నానాలు చేయించారు. ఇలా చేయడం వారికి మోక్షం కలుగుతుందని ఆమె అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

New Update
maha kumbh

maha kumbh

మహా కుంభమేళా...నదుల్లో పవిత్ర స్నానం చేసేందుకు కేవలం భారతీయులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా చాలా మంది వస్తున్నారు. ఈ కుంభమేళాలలో చాలా మంది పుణ్య స్నానాలు ఆచరించడంతో పాటు తమ పెద్దలకు, పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ  చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also Read: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

ఓ మహిళ ప్రయాగ్‌రాజ్‌ వద్ద జరిగే కుంభమేళాకు వచ్చారు.ఆమె తనతో పాటు చనిపోయిన తల్లిదండ్రుల ఫొటోలు కూడా తీసుకుని వచ్చి...వాటికి పుణ్యస్నానాలు చేయించారు.గంగ,యమున,సరస్వతి నదుల సంగమం..త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం వల్ల తన తల్లిదండ్రులకు మోక్షం లభిస్తుందని ఆమె ఇలా చేసినట్లు తెలిపారు.

Also Read: America: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

ఆమె ఇలా చేయడం అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడం వల్ల నెటిజన్లు ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. బతికి ఉన్న తల్లిదండ్రులనే వదిలేస్తున్న ఈరోజుల్లో చనిపోయిన వారికి మోక్షం కోసం ఆ కుమార్తె చేసిన పనికి అంతా ఫిదాఅవుతున్నారు. పిల్లలు అంటే ఈమెలా ఉండాలని ప్రశంసిస్తున్నారు. 

కుంభమేళా జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వ తేదీ వరకు కొనసాగుతాయి.

Also Read: USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం

Also Read: America: సిరియా పై విరుచుకుపడిన అమెరికా..మోస్ట్‌ వాటెండ్‌ సీనియర్‌ ఉగ్రవాది హతం!

Advertisment
తాజా కథనాలు