/rtv/media/media_files/2025/01/31/kCUh5hmDAoBl63njXY03.jpg)
Nirmala Sitharaman
Economic Survey: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే నివేదికను శుక్రవారం పార్లమెంటులో విడుదల చేశారు. ఆర్థిక సర్వే నివేదిక దేశ ఆర్థిక పరిస్థితుల గురించి వాస్తవిక వివరాలను అందిస్తుంది. ఈ నివేదికలో ద్రవ్యోల్బణం రేటు, మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి అంచనా వేస్తారు. ఫైనాన్షియల్ సర్వే రిపోర్ట్‌ను ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ తయారు చేస్తోంది. ఈ సర్వే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాతి రోజు (ఫిబ్రవరి 1) శనివారం నిర్మలా సీతారామన్ స్వయంగా పార్లమెంటులో ముందస్తు బడ్జెట్(Budget)ను సమర్పించనున్నారు.
Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు
Also Read: పెళ్లి ఆగింది.. ఉద్యోగం పోయింది.. సైఫ్ కేసులో అమాయకుడి జీవితం నాశనం!
2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?
ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 నుంచి 6.8 శాతం మధ్య వృద్ధి చెందుతుందని సర్వేలో ఎఫ్‌ఎం సీతారామన్ అంచనా వేశారు. కూరగాయల ధరలు క్రమంగా తగ్గుతుండటం, ఖరీఫ్ పంటలు కూడా అదే సమయంలో రావడం వల్ల 2025 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కాలంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని సర్వే పేర్కొంది. రబీ పంటల దిగుమతి కూడా ఆహార ధరలు అదుపులో ఉండటానికి సహాయపడుతుందని భావిస్తు్న్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న అంతర్జాతీయ వ్యవసాయ ధరలు ద్రవ్యోల్బణానికి ప్రమాదాన్ని తెస్తాయి. అధికారిక ఉపాధి రంగంలో కూడా భారత్ గణనీయమైన వృద్ధి చెందిందని సర్వేలో తెలిపారు. EPFO ఖాతాదారులు 2019 ఆర్థిక సంవత్సరంలో 61 లక్షల ఉండగా.. 2024లో 131 లక్షలకు చేరిందట.
Also Read: USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..
Also Read: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్ పగిలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!