/rtv/media/media_files/2025/04/03/Ja05qtx2tO8qF3paMEsC.jpg)
gjarat
గుజరాత్‌లో ఓ యుద్ధం విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. జామ్‌నగర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్ ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ప్రస్తుతం ఆ పైలట్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నాడు. నైట్ మిషన్‌లో భాగంగా జాగ్వార్ యుద్ద విమానాన్ని పైలట్లు నడుపుతుండగా సాంకేతికలోపంతో ప్రమాదం చోటచేసుకుంది. ఘటనపై ప్రకటన చేసిన భారత వాయుసేన.. యుద్ధం విమానంలో ప్రయాణిస్తున్న పైలట్లు సాంకేతిక లోపం తలెత్తడంతో సురక్షితంగా కిందకు దింపే ప్రయత్నం చేశారు. ఎజెక్షన్ ప్రారంభించి వైమానిక స్థావరం, స్థానికులకు హాని జరగకుండా నివారించారు’ అని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు చెప్పింది.
Also Read: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
ఈ ఘటనలో తమ పైలట్ మృతి తీవ్ర విచారకరమని, కష్టసమయంలో అయన కుటుంబానికి భారత వైమానిక దళం అండగా ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. జామ్‌నగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని సువర్ద గ్రామంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాంకేతికలోపంతో విమానం కూలిన తర్వాత కాక్‌పీట్, వెనుక భాగం వేర్వురు ప్రాంతాల్లో పడ్డాయి. అనంతరం చెలరేగిన మంటల్లో కాక్‌పీట్ దగ్దమవుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. రోజువారీ శిక్షణలో భాగంగా రెండు సీట్ల జాగ్వార్ యుద్ధ విమానాన్ని పైలట్లు నడిపినట్టు ఐఏఎఫ్ అధికారులు పేర్కొన్నారు.
రెండు ఇంజిన్లు కలిగిన జాగ్వార్ యుద్ధ విమానం.. రన్‌వేతో లేకుండానే టేకాక్ కాగలదు. భారత వైమానిక దళం విస్తృతంగా ఉపయోగించే ఈ యుద్ధ విమానాన్ని 70వ దశకంలో తొలిసారి చేర్చారు. గడిచిన కొన్నేళ్లలో అనేకసార్లు దీనిని అప్‌గ్రేడ్ చేశారు. లేజర్ గైడెడ్ బాంబులు, నైట్-విజన్ సామర్థ్యం దీని సొంతం. ఒకేసారి అనేక బాంబులు, మిసైళ్లను మోసుకెళ్లగలిగే జాగ్వార్.. అణు బాంబులు మోసుకెళ్లగలిగిన ఐఏఎఫ్‌లోని కొద్ది విమానాల్లో ఒకటి. అయితే, గతంలోనూ ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. జనవరి 2021లో ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వద్ద విమానం కూలిపోగా.. పైలట్ క్షణాల్లో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. దీనికి ముందు 2017, 2018, 2019ల్లోనూ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
Also Read: Trump Tarriffs: నిజమైన స్నేహితుడు అయితే ఇలా చేయడు...ట్రంప్ సుంకాల పై వివిధ దేశాధినేతలు!
Also Read: Telangana: తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానలు... ఆరెంజ్ అలర్ట్ జారీ
gujarat | pilot | flight | accident | dead | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
Follow Us