BREAKING: తెలంగాణలో మరో బస్సు ప్రమాదం..స్పాట్లో...
సంగారెడ్డి జిల్లా కందిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సంగారెడ్డి జిల్లా కందిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరు ఉలవపాడు బైపాస్ దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 13 మంది మహిళలకు, కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరు మహిళలు రోడ్డుపైనే తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ప్రస్తుతం నలుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉంది.
ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే ప్రాణాలు తీసింది. అదుపు తప్పిన అంబులెన్స్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మోటార్సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంటను చూసి కాలానికి కన్నుకుట్టింది. భవిష్యత్తులో బంగారు జీవితం గడపాలని కలలు కన్న వారి కలలన్నీ కల్లలయ్యాయి. పారాణి ఆరకముందే ప్రియురాలైన నవవధువు మృతిచెందగా..ప్రియుడైన వరుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో- గూడూరుపల్లి దగ్గర ఎదురెదురుగా 2 RTC బస్సులు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.
కన్నడ బిగ్ బాస్ నటి దివ్య సురేష్ హిట్ అండ్ రన్ కేసులో పట్టుబడ్డారు. అక్టోబర్ 4న తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తల్లీ కుమార్తె మృతి చెందారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో రమాదేవి, తేజస్విలు మృతి చెందగా..మరి కొందరు గాయపడ్డారు.