/rtv/media/media_files/2025/04/22/MLfr9nILwfGuKxkoxUrM.jpg)
dgp
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఉన్న మృతుడి భార్య పల్లవి కదలికల పై పోలీసులు ఆరా తీశారు.ఈ క్రమంలో గుర్తించిన కొన్ని కీలక విషయాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు ముందు ఐదు రోజులు గూగుల్ లో హత్య గురించిన వివరాలను పల్లవి వెదికినట్లు తెలిసింది.
Also Read: TG Crime: కూతురు కాళ్లు పట్టుకుంటే తల్లి పీక పిసికింది.. భార్య చేతిలో బలైన మరో భర్త!
ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడో ఆమె తెలుసుకున్నారని పోలీసులు వర్గాలు వెల్లగించాయి. ఓం ప్రకాశ్ ను ఆయన భార్య పల్లవి,కుమార్తె కృతి పథకం ప్రకారం కడతేర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. తానే హత్య చేసినట్లు పల్లవి పోలీసుల విచారణలో అంగీకరించారు.దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.హత్యలో కృతి పాత్ర పై లోతుగా విచారిస్తున్నారు.
Also Read: Stock Market: 5రోజుల లాభాల పరుగుల తర్వాత నెమ్మదించిన దేశీ స్టాక్ మార్కెట్లు
Wife Murders Ex Dgp With The Help Of Google
ప్రస్తుతం ఆమె మానసిక స్థితిని కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు. ఈ దారుణ ఘటన పై ఓం ప్రకాశ్ కుమారుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పల్లవిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఇక దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం సాయంత్రం ఆమెను ఘటనాస్థలానికి తీసుకెళ్లి ప్రశ్నించారు.
హత్యకు ముందు నిందితురాలు వాట్సాప్ గ్రూప్ లో పలు మెసేజ్ లు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.సొంత ఇంట్లోనే తనను బంధించారని ,నిరంతర నిఘాలో ఉన్నానని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన కుమార్తె భద్రత గురించి కూడా ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
ఈ హత్యకు ఓం ప్రకాశ్ భార్య మానసిక స్థితి ఎంత కారణమో...ఆస్తి గొడవలూ కూడా అంతే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓం ప్రకాశ్ భార్య,కుమార్తె వద్ద కంటే కుమారుడు, చెల్లితో ఉండేందుకే ఇష్టపడేవారు.ఉత్తర కన్నడ జిల్లా దండేలి వద్ద ఉన్న 17 ఎకరాల భూమిని కుమారుడు,చెల్లికి రాసేందుకు సిద్ధమయ్యారు.దీంతో భార్య,కుమార్తెలు ఓం ప్రకాశ్‌తో నిత్యం గొడవ పడుతూ చివరకు ప్రాణాలు తీసే స్థితికి చేరారని అనుమానిస్తున్నారు.
Also Read: Mumbai:మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!
Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
karnataka | Former DGP | murder | bengalore | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates