Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోనీయా గాంధీ స్పందించారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌ రాసిన లేఖకు సమాధానంగా ఆమె కూడా ఓ లేఖ రాశారు. ప్రవీణ్‌ మృతి విషయం తన దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాస్టర్ మృతిపై లెవనేత్తిన అంశాలను పరిశీలిస్తున్నాని అందులో పేర్కొన్నారు.

New Update

పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై ప్రముఖ రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్‌ది హత్యేనంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వాదిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన పోస్టుమార్టం రిపోర్టుకు వ్యతిరేకంగా సందేహాలు లేవనెత్తుతున్నారు. ఇదే విషయంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ ఈ నెల 16వ తేదీన సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు.

Sonia Gandhi Reaction On Pastor Praveen

సోనియా గాంధీ రియాక్షన్

పాస్టర్ ప్రవీణ్‌ది హత్యేనంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రవీణ్ మృతిపై హర్ష కుమార్ లేవనెత్తిన అంశాలను సోనియా గాంధీ నోట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దానికి సమాధానంగా సోనియా గాంధీ ఒక లేఖ రాశారు. ప్రవీణ్‌ మృతి విషయం తన దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీరు లెవనేత్తిన అంశాలను పరిశీలిస్తున్నా అంటూ అందులో పేర్కొన్నారు.

కేఏ పాల్ సంచలన ఆరోపణలు

ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆంద్రప్రదేశ్ పోలీసులు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్‌కు వ్యతిరేకంగా ప్రవీణ్‌ది హత్యే అని ఆయన వాదిస్తున్నారు. ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఆర్టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో కేఏ పాల్ హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.

ఇప్పటికే ఆయన ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముమ్మాటికీ పాస్టర్ ప్రవీణ్‌ను దారుణంగా మర్డర్ చేశారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ప్రవీణ్‌ను చంపి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని ఆయన గట్టిగా చెబుతున్నారు. అన్ని వందల సీసీటీవీ పుటేజీల్లో ఒక్క చోటైనా ప్రవీణ్ ముఖం కనిపించిందా అని కేఏ పాల్ అనుమానం వ్యక్తం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించి కేఏ పాల్ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కేఏ పాల్ ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వ్యూ చూడండి.

paster praveen | latest-telugu-news | telugu-news | sonia-gandhi

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు