Mumbai:మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!

గత సంవత్సరం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బహిరంగంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుమారుడు జీషన్ సిద్ధిఖీకి కూడా అలాంటి బెదిరింపులే వచ్చాయి.అతని తండ్రిలాగే అతన్ని కూడా చంపేస్తామని సందేశం పంపించారు.

New Update
baba

baba

NCP నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీని కూడా హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయి. రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తూ జీషన్‎కు ఇమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. నువ్వు డబ్బు ఇవ్వకపోతే, నీ తండ్రి లాగే నిన్ను కూడా చంపేస్తామని మెయిల్‌లో ఉంది. బెదిరింపు చేస్తున్న వ్యక్తి తనను తాను 'డి-కంపెనీ' సభ్యుడిగా చెప్పుకున్నాడు. అంతేకాదు ఈ విషయం పోలీసులకు తెలుపవద్దని జీషన్‌ను హెచ్చరించారు కూడా.

Also Read: Stock Market: 5రోజుల లాభాల పరుగుల తర్వాత నెమ్మదించిన దేశీ స్టాక్ మార్కెట్లు

హత్య బెదిరింపులు వచ్చిన తర్వాత, జీషన్ సిద్ధిఖీ.. పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే బాంద్రా పోలీసులు అతని ఇంటికి చేరుకున్నారు.తరువాత ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో జీషాన్‌కు ఎవరు ఇమెయిల్ చేశారు, ఎవరు బెదిరించారనే వివరాల గురించి తెలుసుకుంటున్నారు.

Also Read: Maharashtra:రాజ్‌ తో చేతులు కలిపేందుకు ఉద్ధవ్‌ రెడీ!

గతేడాది తండ్రి బాబా సిద్ధిఖీ..!

బాబా సిద్ధిఖీ 2024 అక్టోబర్ 12న దారుణ హత్యకు గురయ్యారు. 66 సంవత్సరాల వయస్సులో, ఆయన కుమారుడి  కార్యాలయం వెలుపల ముగ్గురు దుండగులు ఆయన్ని కాల్చి చంపారు . తరువాత ఈ కేసు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ముడిపడి ఉందని విషయం తెలిసింది.

గతంలో కూడా బెదిరింపులు

గత ఆరు నెలల్లో జీషాన్‌కు అనేకసార్లు హత్యా బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 2024లో, నోయిడాకు చెందిన 20 ఏళ్ల టాటూ ఆర్టిస్ట్ మహ్మద్ తయ్యబ్, వాట్సాప్ ద్వారా జీషన్‌ను బెదిరించినందుకు అరెస్ట్ అయ్యాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ డ్రోన్లతో దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. గత సంవత్సరం, ఆజం మొహమ్మద్ ముస్తఫా అనే 56 ఏళ్ల వ్యక్తి కూడా ముంబై ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్‌కు వాట్సాప్ సందేశం ద్వారా జీషన్‌ను బెదిరించాడు.

ఇందులో అతను జీషన్, సల్మాన్ ఖాన్ నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ముస్తఫా సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన నిరుద్యోగి. ఆ మరుసటి రోజే అతన్ని అరెస్టు చేశారు. జీషన్ సిద్ధిఖీ తండ్రి హత్య తర్వాత, అనేక బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అతని భద్రతను కట్టుదిట్టం చేశారు. అతనికి 'Y' కేటగిరీ భద్రతను కల్పించారు పోలీసులు.

Also Read: Breaking: బస్సు బోల్తా..20 మంది స్పాట్‌ లోనే..!

Also Read: Telangana: టీచర్లకు సెలవుల్లేవ్‌.. ఎవరూ, ఎక్కడకి వెళ్లొద్దని ఆదేశాలు!

mumbai | baba siddique | baba siddique lawrence bishnoi | jeeshan siddique | latest-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు