ఈరోజు స్టాక్ మార్కెట్లు మొదలవడం ఫ్లాట్ గా ఉన్నా..తరువాత కాస్త తేరుకున్నాయి. కానీ మరీ అంత దూకుడుగా ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాల నడుమ దేశీ సూచీలు నెమ్మదించాయి. మదుపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 10 పాయింట్లు తగ్గి 79,650 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 24,200 స్థాయిలో ఉంది.
సెన్సెక్స్ స్టాక్‌లు 30లో.. 16 లాభాల్లో ఉన్నాయి. జొమాటో, కోటక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 4% వరకు పెరిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 3.50% పడిపోయాయి. ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ మ, ఎయిర్‌టెల్ 1% వరకు క్షీణించాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే.. 50 స్టాక్స్‌లో 46 లాభాల్లో ఉన్నాయి. NSE రంగాల సూచీలలో, FMCG, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు వినియోగ వస్తువులు 1% పెరిగాయి.
అమెరికా మార్కెట్ డౌన్..
సోమవారం అమెరికా మార్కెట్లు పతనమయ్యాయి. అలాగే ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికాకు చెందిన డౌ జోన్స్ 972 పాయింట్లు, నాస్‌డాక్ కాంపోజిట్ 416 పాయింట్లు , ఎస్&పి 500 ఇండెక్స్ 125 పాయింట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 24 పాయింట్లు తగ్గి 34,255 వద్ద ఉంది. కొరియాకు చెందిన కోస్పి 4 పాయింట్లు పెరిగి 2,493 వద్ద ట్రేడవుతోంది. చైనా షాంఘై కాంపోజిట్ 0.32% పెరిగి 3,302 వద్ద ట్రేడవుతోంది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 0.37% తగ్గి 21,316 వద్ద ట్రేడవుతోంది.
ఇక బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర పన్నులతో కలిపి ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అంచర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం సోమవారం 3,405 డాలర్లకు చేరింది.
today-latest-news-in-telugu | stock-market | sensex | nifty
Also Read: Trump Vs Harvard: ట్రంప్ ప్రభుత్వంపై హార్వర్డ్ దావా