/rtv/media/media_files/2025/03/12/aAigignVzz1KqSaepxNz.jpg)
Medak wife murdered husband
TG Crime: మెదక్‌లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కూతురితో కలిసి కనికరంలేకుండా చంపేసి కాటికి పంపించారు. వొద్దని తండ్రి వేడుకుంటున్నా ఏ మాత్రం జాలిచూపకుండా అదిమిపట్టి గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేదని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్థులు రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడగా అమానుషమైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read : సూర్యపేటలో హైటెన్షన్.. రోడ్డుపై ధాన్యం తగలబెట్టిన రైతులు.. ఏం జరిగిందంటే!
మెడకు చీర బిగించి హతం..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నామాపూర్ లో ఆదివారం ఈ ఘటన జరిగింది. గొల్ల జోగయ్య (51) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొంతకాలంగా మద్యానికి బానిసైన జోగయ్య.. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలాగే తాగిన జోగయ్య.. గట్టిగా మందలిస్తే భార్య, బిడ్డను కొట్టేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నాగమ్మ తన ఇంట్లో చిన్న కూతురి సహాయంతో జోగయ్యను చంపేసింది. మద్యం మత్తులో ఉన్న జోగయ్య కూతురు అతని కాళ్లు పట్టుకోగా నాగమ్మ మెడకు చీర బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది.
ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..
అనుమానంతో పక్కింటివారు జోగయ్య ఇంటికి వెళ్లగా అతను అపస్మారక స్థితిలో పడివున్నాడు. వెంటనే మెదక్ ఆస్ప త్రికి తరలించారు. కానీ అప్పటికే జోగయ్య చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జోగయ్య మెడకు కమిలిన గాయం గమనించి నాగమ్మను నిలదీయడంతో నిజం ఒప్పుకుంది. జోగయ్య సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల
Also Read : పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది మరొకటి లేదు: ఉప రాష్ట్రపతి
father | killed | daughter | wife | telugu-news | today telugu news