/rtv/media/media_files/2025/04/21/iUqe1sGDQJm9aeZEM8z4.jpg)
500 Rupees Fake notes
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. నకిలీ రూ.500 నోట్లు చలామణిలో తిరుగుతున్నాయని అప్రమత్తం చేసింది. ఒరిజనల్ నోట్లలాగే అచ్చం నకిలీ నోట్లు కూడా ఉన్నాయని.. దాని క్వాలిటీ, ప్రింటింగ్ చూస్తే ఆ ఫేక్ నోట్లను గుర్తించడం కష్టమవుతోందని తెలిపింది. అయితే ఈ ఫేక్ నోట్లను చిన్న తేడాను గమనించి గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఒరిజినల్ నోట్లపై “RESERVE BANK OF INDIA" అని రాసి ఉంటుంది.
Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?
Fake Notes - RBI
అయితే ప్రస్తుతం చలామణి అవుతున్న ఈ ఫేక్ నోట్లలోని 'RESERVE' పదంలో చివరి లెటర్ E స్థానంలో A పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ చిన్న తప్పును గుర్తించాలన్నా కూడా ఆ నోటును జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు. ఇలాంటి ఫేక్ నోట్లు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ నోట్ల విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సంబంధిత ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు .
Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!
అయితే ప్రస్తుతం ఎన్ని ఫేక్ నోట్లు చలామణిలో ఉన్నాయో తెలియదని మరో సీనియర్ అధికారి తెలిపారు. వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు.. ఈ కొత్తరకం నకిలీ నోట్లను ప్రజలు బ్యాంకులో సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్రం నకిలీ నోట్ల గురించి ప్రస్తావించింది. వీటని నివారించేందుకు చేపట్టనున్న చర్యల గురించి మాట్లాడింది మరోవైపు మార్కెట్లలోకి పెద్ద సంఖ్యలో నకిలీ నోట్లు చేరిపోయినట్లు అధికారిక వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఫేక్ నోట్లను తయారుచేసేవాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని.. నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు .
Also Read: వావ్.. భారత సంప్రదాయ దుస్తుల్లో వాన్స్ పిల్లలు.. చూస్తే ఫిదా అవుతారు!
Also Read : తెలంగాణలో రోహిత్ వేముల చట్టం.. ! సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ సంచలన లేఖ
fake-notes | reserve-bank-of-india | rbi | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu