వావ్.. భారత సంప్రదాయ దుస్తుల్లో వాన్స్ పిల్లలు.. చూస్తే ఫిదా అవుతారు!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుటుంబ సభ్యులతో ఇండియా చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో జేడీ వాన్స్ పిల్లల వస్త్రధారణ ప్రత్యేకంగా నిలిచింది. ఇద్దరు కుమారులు కుర్తా, పైజమా ధరించగా.. కూతురు అనార్కలీ లాంగ్ ఫ్రాక్‌లో కనిపించగా నెటిజన్లు వావ్ అంటున్నారు.

New Update
JD VANCE FAMILY

JD VANCE FAMILY

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జేడీ వాన్స్ ఇండియాకు వచ్చారు. అయితే ఎయిర్‌పోర్టులో జేడీ వాన్స్ పిల్లల వస్త్రధారణ ప్రత్యేకంగా నిలిచింది. భారత సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. జేడీ వాన్స్ ఇద్దరు కుమారులు ఇవాన్, వివేక్ కుర్తా, పైజమా ధరించగా.. కూతురు మీరాబెల్‌ అనార్కలీ లాంగ్ ఫ్రాక్‌లో ఇండియాకి వచ్చారు. వీరిని చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ముగ్గురు పిల్లలు క్యూట్ ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: 10th Class Students: ఆన్సర్ షీట్లో రూ.500.. ఛాయ్‌ తాగి నన్ను పాస్‌ చేయండి - 10th క్లాస్ స్టూడెంట్స్ అరాచకం

నాలుగు రోజుల పర్యటనలో..

జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో ఇండియా పర్యటనకు వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియా పర్యటనకు జేడీ వాన్స్ రావడం ఇదే మొదటిసారి. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీని జేడీ కలవనున్నారు. ఆ తర్వాత వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు కొన్ని ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత జేడీ వాన్స్ దంపతులు విందు చేసి.. జయపురకు వెళ్తారు. అక్కడ రాంభాగ్ ప్యాలెస్‌లో బస చేసి.. అక్కడ చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఆగ్రా వెళ్లి.. 24వ తేదీన జయపుర నుంచి అమెరికాకు తిరిగి బయలుదేరుతారు. 

ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు