/rtv/media/media_files/2025/01/28/7HpxZ7WDZ9sQdscbDCnD.jpg)
Indigo Flight
Flight Viral Video: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడం కలకలం రేపింది. దీంతో సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఇండిగో విమానంలో జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: అలా చేశావేంటమ్మా.. చనిపోయాక ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు బాలిక సూసైడ్..
ఇక వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం ఉదయం ఇండిగో విమానం జోధ్‌పూర్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు రెడీగా ఉంది. మరికొన్ని క్షణాల్లోనే టేకాఫ్ అవుతుందనగా అందులో ఉన్న ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా అత్యవసర డోర్‌ను తెరిచాడు. దీంతో విమానంలో గందగోళం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని విమానం నుంచి దింపేశారు.
Also Read: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు
సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు అతడిని అరెస్టు చేశారు. విమానం బయలుదేరేందుకు 20 నిమిషాల పాటు ఆలస్యమయ్యిది. అయితే అతడు ఇలా అకస్మాత్తుగా ఎమర్జెన్సీ డోర్ ఎందుకు తెరిచాడనేదానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆ వ్యక్తిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా రియాక్ట్ అయ్యింది. ఇలాంటి ఆసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నామని.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: రోహిణి-125 నుంచి రేపటి GSLV-F15 వరకు.. షార్ సక్సెస్ స్టోరీ ఇదే..
Also Read: శాశ్వతంగా వారానికి నాలుగు రోజులే పని.. 200 కంపెనీలు సంచలన నిర్ణయం