Maharashtra: అలా చేశావేంటమ్మా.. చనిపోయాక ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు బాలిక సూసైడ్..

మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మహారాష్ట్రలో ఓ బాలిక (17) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. బాలిక ఫోన్‌లో మరణం తర్వాత ఏం జరుగుతుంది? విదేశీ సంస్కృతుల గురించి ఎక్కువగా గూగుల్‌లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు.

New Update
death

death

మనిషి చనిపోయాక కొందరు స్వర్గం లేదా నరకానికి వెళ్తుంటారని చెబుతారు. మరికొందరు వాటిని కొట్టి పారేస్తుంటారు. ఈ అంశంపై ఇప్పటికీ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ బాలిక (17) చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేసింది. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకనేందుకు ఆ బాలిక సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రంలో జరిగింది.   

Also Read: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు

ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌కు చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె ఇంట్లో సూసైడ్‌ చేసుకోవండంతో తన తల్లిదండ్రులు షాకైపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలిక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె తన ఫోన్‌లో మరణం తర్వాత ఏం జరుగుతుంది ? అలాగే విదేశీ సంస్కృతుల గురించి ఎక్కువగా గూగుల్‌లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు.   

Also Read: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. బీజేపీ సంచలన వ్యూహం

కొంతకాలం నుంచే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఆ బాలిక ఆన్‌లైన్‌ గేమింగ్‌కు కూడా బానిసైపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో ఓ కత్తిని కూడా ఆర్డర్ చేసుకుంది. ముందుగా తన చేయిని గాయపర్చుకుంది. ఆ తర్వాత మెడను కోసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం దీనిపై మిగతా కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. 

Also Read: AI రంగంలో చైనా సంచలనం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే

Also Read: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు