/rtv/media/media_files/2025/01/28/cLZVl9Ai5yi4Vslf7wPX.jpg)
isro shar Photograph: (isro shar)
అది 1969 ఆగస్ట్ 15.. ఇండియాకు 22 ఏళ్లు. స్వాతంత్ర్యం వచ్చి పాతికేళ్లు కూడా కాని భారత్.. అంతరిక్షం వైపు అడుగులు వేసింది. అప్పటి వరకు ఆంగ్లేయుల చేతిలో ఉన్న మనకు పాలన కూడా అంతంతమాత్రమే తెలుసు. కనీసం జిల్లాకో స్కూల్ కూడా లేని ఈ రోజులు అవి. 1957 అక్టోబరు 4న సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్‌ను ప్రయోగించడంతో ప్రపంచం దృష్టి అంతరిక్ష పరిశోధన వైపు మళ్లింది. 1969 జూలై 20న అమెరికా మనిషినే చంద్రుడిపైకి పంపింది. దీంతో అప్పుడే రెక్కలొచ్చిన భారత్ కూడా ఆకాశంలోకి ఎగరాలని చూసింది. అదే ఏడాది ఆగస్ట్ 15 ఇస్రో( ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ను ఏర్పాటు చేసింది. ఆ టెక్నాలజీ, బడ్జెట్.. మానవ వనరులు ఏవీ మన దగ్గర లేవు. కానీ పట్టువదలని ఇండియన్ సైంటిస్టుల కృష్టి భారత్‌ను కూడా 1975లో అంతరిక్ష రంగంలోకి చేర్చింది.
అంతరిక్ష రంగంలోకి ఇండియా..
ఇండియా ఫస్ట్ ఉపగ్రహం ఆర్యభట్ట, రష్యా తయారు చేసిన రాకెట్‌లో 1975 ఏప్రిల్ 19న నింగిలోకి పంపాం. సొంతంగా రాకెట్ తయారు చేసుకోలేని స్టేజ్ నుంచి ఇప్పుడు అతి తక్కువ ఖర్చులో అభివృద్ధి చెందిన దేశాలకు రాకెట్లు, శాటిలైట్లు తయారు చేసే స్థాయికి ఎందిగాం. 1962 నుంచి మొదలైన జర్నీ 2025 జనవరి 29నాటికి ఒక స్పేస్ సెంటర్ నుంచే 100 రాకెట్లు ల్యాంచ్ చేయబోతున్న రికార్డ్ సృష్టిస్తున్నామ్. దీనికి కారణమే ఇస్రో. ఈరోజు మొబైల్, టీవీ చూడగలుగుతున్నామంటే.. ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి, ఇస్రో విజయాలే కారణం. ఒక సంవత్సరానికి 13వేల కోట్ల బడ్జెట్ ఇస్రోకు ఇండియన్ గవర్నమెంట్ కేటాయిస్తోంది. అసలు ఇస్రో స్టోరీ ఏంటి? ఎందుకు ఇన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తు్న్నామ్? ఇప్పటివరకు ఇస్రో సాధించిన రికార్డులేంటి డిటేల్‌గా చూద్దాం...
1962 ఇంకోస్పర్‌కు నుంచి 1969 ఇస్రో వరకు..
డాక్టర్ హోమీభాభా అణు ఇంధన శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆ టైం 1962 ఫిబ్రవరిలో భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ (INCOSPAR) అటామిక్ ఎనర్జీ విభాగంలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దానికి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చీఫ్. ఇంకోస్పర్‌కు ఇండియా రాకెట్ ఆకాశంలోకి ఎగిరేయ్యాలని ఆశ. దీనికోసం తిరువనంతపురం సమీపంలోని తుంబాలో లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. 1962లోనే తుంబా లాంచ్ ప్యాడ్ ఏర్పాటు ప్రారంభమైంది. అయితే రాకెట్ లాంచ్‌కు చాలా టెక్నాలజీ అవసరం. అమెరికా, రష్యా వంటి దేశాలు ఆ టెక్నాలజీని సీక్రెట్‌గా ఉంచాయి. వాతావరణ డేటాను నిల్వ చేయడానికి జియోమాగ్నెటిక్ కోర్ దగ్గర లాంచ్ ప్యాడ్ అవసరం. ఈ పరిస్థితిలో దక్షిణ భారతదేశం లాంచ్ ప్యాడ్‌కు అనువైన ప్రదేశం అక్కడని వెతికారు.
ఇండియాకు నాసా ఇచ్చిన ఫస్ట్ రాకెట్ Nike-Apashe
అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చని ఐక్యరాజ్యసమితికి భారత్ ఓ ప్రతిపాదన సమర్పించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న యంగ్ సైంటిస్టులు ఆర్.అరవముతన్, రామకృష్ణారావు, ఎ.పి.జె.అబ్దుల్ కలాంను శిక్షణ కోసం నాసాకు పంపారు. రాకెట్ ప్రయోగం, ట్రాకింగ్ టెక్నాలజీలో శిక్షణ పొందడమే వారి లక్ష్యం అయినప్పటికీ, నాసాలో శిక్షణ వారిని నిరాశపరిచింది. నాసాలో వారికి అంతగా ఏం నేర్పించలేదు. 1963లో NASA భారతదేశానికి Nike-Apashe రాకెట్‌ను ఇవ్వడానికి ముందుకొచ్చింది. తొలి రాకెట్‌ను 1963 నవంబర్ 21న తుంబా నుంచి ప్రయోగించారు. అంతరిక్షంలో భారత్ సాధించిన విజయానికి ఇదే మొదటి అడుగు. 1964లో అమెరికా ప్రయోగించిన శాటిలైట్‌తో ఆదేశమంతటా టోక్యో ఒలింపిక్స్ ప్రత్యక్ష టెలికాస్ట్ చేశారు.
రాకెట్ రంగంలో ఇండియాకు ఆసక్తి
అప్పుడే ఇండియాకు రాకెట్ సైన్స్‌పై ఆసక్తి పెరిగింది. స్పెస్ టెక్నాలజీపై పరిశోధన, పెట్టుబడులు దేశం డెవలప్ అవడానికి పనికొస్తాయని భారత్ నమ్మింది. దీంతో వెంటనే రష్యా నుంచి ఎం-100 రాకెట్లు, ఫ్రాన్స్ నుంచి సెంటార్ రాకెట్లను తెప్పించుకొని ప్రయోగాలు స్టార్ట్ చేసింది భారత్. 1965లో తుంబాలో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు. రాకెట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గ్రూప్ ఏర్పడింది. ఇవి రాకెట్ ప్రయోగం, శాటిలైట్ తయారీకి అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేశాయి.
ఇండియా స్పేస్ టెక్నాలజీకి ఇందిరా గాంధీ ఊతం..
1968లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తుంబా అంతరిక్ష కేంద్రాన్ని UNOకి అంకితం చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఏర్పడింది. ఆ తర్వాత 1972లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన ఇస్రోను డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ విభాగంలో చేర్చింది. డెరెక్ట్ ప్రధానమంత్రికే రిపోర్ట్ చేసే స్పేస్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే స్పేస్ రీసెర్చ్, అంతరిక్ష యాత్ర ప్రారంభమైనప్పటికీ, దానికోసం ఇందిరాగాంధీనే గట్టగా ప్రయత్నించారు. 1966-77, 1980-84 మధ్య ఇండియా పీఎం ఉన్న ఇందిరాగాంధీ అంతరిక్ష పరిశోధనపై ఎంతో ఆసక్తి చూపారు. ఆమె టైంలోనే ఫస్ట్ ఇండియా అణుపరీక్షలు జరిగాయి. జూలై 1970లో, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ రాబోయే పదేళ్లపాటు అంతరిక్షం, అణుశక్తిలో సాధించాల్సిన లక్ష్యాలకు ప్రణాళిక తయారు చేసిచ్చారు. అప్పుడున్న రెండు టార్గెట్లు శాటిలైట్ ప్రయోగించడానికి ఓ రాకెట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ రెడీ చేసుకోవడమే.
ఇస్రో విభాగాలు ఇవే..
- ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఓ రాకెట్ నింగిలోకి ఎగరాలంటే అనేక యూనిట్లు కలిసి పని చేయాలి.
- లాంచ్ వెహికల్స్ అంటే రాకెట్లు తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తయారు చేస్తారు.
- శాటిలైట్లు బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్ (URSC)లో డెవలప్ చేస్తారు.
- శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు వీటిని తెచ్చి రాకెట్లలో శాటిలైట్లు అసెంబుల్ చేసి ఆకాశంలోకి పంపిస్తారు.
- రాకెట్ నడవడానికి ఉపయోగించే ఇంధనాలపై లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ వలియమల, బెంగళూరులో ప్రయోగాలు జరుగుతాయి.
- అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ సెన్సార్‌లు, స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్ రెడీ చేశారు.
- హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో శాటిలైట్ పంపిన రిమోట్ సెన్సింగ్ డేటా తీసుకొని డీకోడ్ చేస్తోంది.
ఇలా ఇన్ని విభాగాలు కలిపితే ఇస్రో..
సతీష్ దావన్ స్పేస్ సెంటర్ 100వ రాకెట్..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలో సతీష్ దావన్ స్పేస్ సెంటర్ ఉంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే ఇస్రో లాంచింగ్ ప్యాడ్స్ ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇస్రో తయారు చేసిన దాదాపు అన్నీ శాటిలైట్లు ఇక్కడి నుంచే ప్రయోగిస్తారు. ఇప్పటి వరకు 99 రాకెట్లు ప్రయోగించారు. 2025 జనవరి 29న ప్రయోగించే GSLV-F15 రాకెట్ ప్రయోగం షార్ నుంచి చేసే వందో ప్రయోగం. షార్ నుంచి ఇస్రో జరిపిన 99 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి. విజయవంతమైన ప్రయోగాల్లో 129 స్వదేశీ ఉపగ్రహాలను, 433 భారతీయ ఉపగ్రహాలు, 2 ప్రైవేట్ శాటిలైట్లు, ఒక గగనయాన్ టెస్ట్ వెహికిల్ డీ వన్, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను ఇస్రో ఇక్కడి నుంచే ప్రయోగించింది. 1971 నుంచి శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగాలు జరుగుతున్నాయి. తర్వాత దీనికి ఇండియన్ గణితశాస్త్రవేత్త, ఏరో స్పేస్ ఇంజనీర్ అయిన సతీష్ ధావన్ పేరు పెట్టారు. 1971 అక్టోబర్ 9న చిన్న సౌండింగ్ రాకెట్ రోహిణి-125ని ఫస్ట్ టైం ఇక్కడి నుంచి ప్రయోగించారు. (శ్రీహరి కోట)షార్‌లో 45 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్న ఇస్రో.. ఈమధ్య ఎక్కువ విజయాలు సాధిస్తోంది. 1979 నుంచి 2000 వరకూ ఈ స్పేస్ సెంటర్‌లో 13 ప్రయోగాలు చేస్తే అందులో 4 విఫలమయ్యాయి. 1969 నుంచి 2009 వరకూ షార్‌లో 29 ప్రయోగాలు చేసిన ఇస్రో, 2010 నుంచి 2024 వరకూ 15 ఏళ్లలో 70 ప్రయోగాలు ఇక్కడ నుంచే చేసింది. ఇందులో 5 మాత్రమే ఫెయిల్ అయ్యాయి.