/rtv/media/media_files/2025/01/28/PjHZhQutzMPwzUjXOeyp.jpg)
4-Day Work Week
4-Day Work Week: ప్రస్తుతం పని గంటలపై అనేక దేశాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూకే(UK)కు చెందిన పలు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వేతనాల్లో కోత లేకుండానే శాశ్వతంగా వారానికి 4 గంటల పనిదినాలను అమలు చేస్తున్నాయి. వివిధ ఛారిటీ, మార్కెటింగ్, టెక్నాలజీ సంస్థలతో సహా 200 కంపెనీలు ఈ నాలుగు రోజుల పని విధానంలో మారినట్లు పలు మీడియా కథనాలు తెలిపాయి.
Also Read: వాళ్లకి రుణమాఫీ చేయొద్దు.. కేజ్రీవాల్ సంచలన డిమాండ్
4 డే వీక్ ఫౌండేషన్
ఈ పని విధానం వల్ల ఈ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 5 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ అంశంపై '4 డే వీక్ ఫౌండేషన్' క్యాంపెయిన్ డైరెక్టర్ జో రైల్ మాట్లాడారు. '' ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ఉద్యోగం, వారానికి ఐదురోజుల పని అనేవి వందేళ్ల క్రితం నాటి విధానాలు. ప్రస్తుత రోజుల్లో అవి పనిచేయవు. మనం అప్‌డేట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. వారానికి నాలుగు రోజుల పని విధానం వల్ల ఉద్యోగులకు ఎక్కువగా ఖాళీ సమయం దొరుకుతుంది. దీనివల్ల ప్రజలు సంతృప్తికంగా జీవించేందుకు స్వేచ్ఛ దొరుకుతుందని'' అన్నారు.
Also Read: అరుణాచల్‌ప్రదేశ్‌పై అడిగిన ప్రశ్నకు డీప్‌సీక్ షాకింగ్ ఆన్సర్..
ముందుగా నాలుగురోజుల పని విధానాన్ని బ్రిటన్‌లో దాదాపు 30 మార్కెటింగ్, యాడ్స్, ప్రెస్ రిలేషన్స్ వంటి సంస్థలు అమలు చేశాయి. ఆ తర్వాత 29 ఛారిటీలు, 24 టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థలు, 22 మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇక లండన్‌లో చూసుకుంటే 59 కంపెనీలు ఈ నాలుగు రోజుల పని విధానాన్ని పాటిస్తున్నాయి.
Also Read: ఆమెకు 60, అతనికి 30.. ఇదొక విచిత్రమైన ప్రేమ కథ!
Also Read: గూగుల్ మ్యాప్స్‌లో మారిన గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు..కానీ అక్కడ మాత్రం!