Maha Kumbh: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు

మహా కుంభమేళాలో కన్నీళ్లు పెట్టించే ఓ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు వృద్ధ దంపతులను వారి కొడుకులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. చలిలో వణుకుతున్న ఆ జంటకు ఓ వ్యక్తి డబ్బులిచ్చి, ఆశ్రమానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

New Update
Old Couples in Maha Kumbh

Old Couples in Maha Kumbh

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్కడ కన్నీళ్లు పెట్టించే ఓ ఘటన వెలుగుచూసింది. మహాకుంభమేళాలలో ఇద్దరు వృద్ధ దంపతులను వారి కొడుకులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. వీడియోలో చూసుకుంటే రాత్రి సమయంలో ఓ వృద్ధ జంట చలిలో వణుకుతూ కూర్చున్నారు. ఓ వ్యక్తి ఆ వృద్ధ జంటకు కొంత డబ్బు ఇచ్చాడు. 

Also Read: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. బీజేపీ సంచలన వ్యూహం

తాను ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటానని ఈ డబ్బు ఉంచుకోండి అని ఇచ్చాడు. పొద్దున్నే వచ్చి ఆశ్రమానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఆ వృద్ధ జంట గురించి వివరాలు అడిగారు. ఎక్కడి నుంచి వచ్చారు, పిల్లలున్నారా అటూ ప్రశ్నించాడు. అప్పుడు ఆ పెద్దయాన స్పందించాడు. మాకు ముగ్గురు కొడుకులు, కోడళ్లు ఉన్నారని తెలిపాడు. వాళ్లు మమ్మల్ని బాగా వేధిస్తున్నారని, చాలా దుర్మార్గులంటూ ఆ వృద్ధుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు భర్త మాటలు విన్న అతని భార్య కన్నీళ్లు పెట్టుకుంది.    

Also Read: ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్‌దే !.. సంచలన సర్వే

శివం బికనేరి అఫీషియల్‌ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. నెటిజన్లు ఆయన చేసిన మంచి పనిని ప్రశంసిస్తున్నారు. దేశంలో వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టే కొడుకులు దేశంలో చాలామంది ఉన్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read: రోహిణి-125 నుంచి రేపటి GSLV-F15 వరకు.. షార్ సక్సెస్ స్టోరీ ఇదే..

Also Read: AI రంగంలో చైనా సంచలనం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు