/rtv/media/media_files/2025/09/21/x-2025-09-21-15-38-27.jpg)
మహారాష్ట్ర(maharashtra) ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(eknath-shinde) ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. హ్యాకర్లు ఆయన ఎక్స్ ఖాతాలో పాకిస్తాన్, టర్కీ జెండాల ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ సంఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరగనున్న రోజున జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ హ్యాకింగ్‌ను గమనించిన వెంటనే, షిండే కార్యాలయం సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించింది.
Also Read : సాయంత్రం 5 గంటలకు మీడియా ముందుకు మోదీ.. ఏం చెప్పబోతున్నారు?
Eknath Shinde’s X Account Hacked: Hackers Post Pakistan and Turkey Flags on Maharashtra Deputy CM’s Account, Restored Within 45 Minutes #EknathShinde#Hack#Maharashtra@IqbalForIndia@mieknathshinde
— LatestLY (@latestly) September 21, 2025
టెక్నికల్ టీమ్ వెంటనే స్పందించి 30 నుండి 45 నిమిషాల్లో ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ హ్యాకింగ్(Hacking) వల్ల ఎలాంటి సున్నితమైన సమాచారం లీక్ కాలేదని అధికారులు తెలిపారు. సైబర్ సెల్ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తోంది. 2024 మేలోఅస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) X ఖాతానఉ హ్యాక్ చేసి హ్యాండిల్ ఖాతా పేరు టెస్లా ఈవెంట్ గా, ప్రొఫైల్ చిత్రాన్ని టెస్లా లోగోగా మార్చారు హ్యాకర్లు .
Also Read : ఏందిరా మామ ఇది.. ప్యూన్ ఉద్యోగాలకు 25 లక్షల మంది దరఖాస్తు
గ్రూప్ దశలో అజేయంగా
ఆసియాకప్ 2025(Asia cup 2025) లో టీమ్ ఇండియా(team-india), పాకిస్థాన్(pakistan) రెండో సారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో అజేయంగా సాగిన సూర్య సేన అదే జోరును సూపర్-4లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది. భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉండగా బ్యాటింగ్‌లో సూర్య, సంజూ, అభిషేక్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అటు పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. దుబాయ్ వేదికగా మ్యాచ్ నేడు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.