Rajasthan : ఏందిరా మామ ఇది.. ప్యూన్ ఉద్యోగాలకు 25 లక్షల మంది దరఖాస్తు

దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు రాజస్థాన్‌లో జరిగిన ఈ సంఘటన చక్కటి ఊదహరణ. అక్కడ 53,000 ప్యూన్ ఉద్యోగాలకు ఏకంగా 2.5 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.

New Update
peon

దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు రాజస్థాన్‌లో జరిగిన ఈ సంఘటన చక్కటి ఊదహరణ. అక్కడ 53,000 ప్యూన్ ఉద్యోగాలకు ఏకంగా 2.5 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా అభ్యర్థుల్లో ఎక్కువ మంది అధిక అర్హతలు కలిగి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.3

Also read : కోట్లు కొల్లగొట్టిన యానిమేషన్ చిత్రం ఇప్పుడు మీ మొబైల్ లో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్యూన్ ఉద్యోగానికి కనీస విద్యార్హత 10వ తరగతి అయినప్పటికీ, దరఖాస్తుదారులలో ఎక్కువ మంది MSc, BTech, BEd, PhD లాంటి ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నారు. ధరఖాస్తు చేసుకున్న వారు  90% మంది దాదాపుగా వీళ్లే ఉన్నారు. 53,749 పోస్టులకు కూర్చున్న వారిలో కేవలం 10% మందికి మాత్రమే కనీస అర్హత ఉంది.  

ఉద్యోగ అభద్రత ఎక్కువగా

గతంలో జరిగిన పరీక్షల లీకేజీల కారణంగా, ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ పరీక్షల్లో మెటల్ డిటెక్టర్లు, డ్రెస్ కోడ్ తనిఖీలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అభద్రత ఎక్కువగా ఉండటంతో, ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో పదవీ విరమణ వరకు ఉద్యోగ భద్రత, మంచి జీతం, పెన్షన్, ఇతర ప్రయోజనాలు ఉంటాయని అభ్యర్థులు భావిస్తున్నారు.  ఈ పరిస్థితి కేవలం రాజస్థాన్‌కే పరిమితం కాదు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. .

Also Read : Donald Trump: శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలి.. ఆమెకు  ట్రంప్‌ సీక్రెట్‌ మెసేజ్‌!

Advertisment
తాజా కథనాలు