/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/yogi-jpg.webp)
Maha Kumbh:మౌని అమావాస్య పర్వదినం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతోన్న కుంభమేళా లో పుణ్య స్నానం ఆచరించేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది భక్తులు మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు.
Also Read: ISRO-GSLV-F15: షార్‌లో విజయ వంతంగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగం
ప్రత్యేకంగా ఘాట్లను...
తొక్కిసలాట జరిగిన త్రివేణి సంగమం ఘాట్ వద్దకు ఎవరూ రావొద్దని భక్తులకు సూచనలు ఇచ్చారు. తమకు సమీపంలో ఉన్న ఘాట్ల వద్దే అమృత స్నానాలు ఆచరించాలని యోగి కోరారు. దేశ వ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్ కు వస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఘాట్లను ఏర్పాటు చేశామని అన్నారు. మిగతా అన్ని ఘాట్లలో పరిస్థితి సాధారణంగా ఉందని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారుల సూచనలు పాటించాలని భక్తులను కోరారు.
Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!
అయితే, నేడు మహా కుంభమేళా కు 10 కోట్ల మంది వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మహా కుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం వద్ద భక్తులు అమృత స్నానం కోసం ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాట జరిగింది. దీంతో ఘాట్ వద్ద బారికేడ్లు విరిగిపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది.
ఈ మేరకు గాయపడిన 50 మంది క్షతగాత్రులను పారా మిలటరీ దళాలు, వాలంటీర్లు అంబులెన్స్‌లలో సమీపంలోని మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్య స్నానానికి భారీ ఎత్తున తరలిరావడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.
Also Read: Zelensky: చర్చలకు పుతిన్ భయపడుతున్నారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు
Also Read: Maha Kumb Mela: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!