/rtv/media/media_files/2025/01/29/57zGMaXcfrcp6bIfut57.jpg)
kumbmela
ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో అపశ్రుతి జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో సెక్టార్-2లోని భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 17 మంది మృతిచెందినట్లు ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.. ఈ ఘటనలో 50 మందికిపైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
#MahakumbhStampede अपनों को बचाने की जद्दोजहद, महिला अपने परिजन को सांस देने की कोशिश करते हुए…हृदय विदारक#kumbh2025#KumbhaMelapic.twitter.com/4PlEl5NIqi
— PRIYANSHU ANAND (@PRIYANSHU_ANND) January 29, 2025
Also Read: CPI(M): సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది.. గాయపడిన వారిని చికిత్స కోసం అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు, తాజా ఘటనతో అఖిల భారత అఖాడా పరిషత్ కమిటీ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. అమృత స్నానాలను రద్దుచేసుకున్నట్టు ప్రకటించింది.
महाकुंभ में भगदड़ की भयानक तस्वीरें !!
— Dr. Jyotsana (jyoti) (@DrJyotsana51400) January 29, 2025
बड़ी संख्या में लोगों के हताहत होने की खबरें हैं। सिर्फ ऑफिशियल कन्फर्म का इंतजार है।
#MahakumbhStampede#MahaKumbh2025#pryagrajpic.twitter.com/7XeNQeYenV
ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా పనిచేసే ఈ అఖండ పరిషత్.. దేశవ్యాప్తంగా ధార్మిక సేవలు, కార్యక్రమాలను చేపడుతుంది. ఫిబ్రవరి 3న మూడో అమృత స్నానం నిర్వహిస్తామని అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షఉడు రవీంద్ర పూరి వెల్లడించారు.
Also Read: Srilanka Navy: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ
‘అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య స్నానానికి బదులు మేము ఫిబ్రవరి 3న మూడో అమృత స్నానం చేయాలని నిర్ణయించాం.. మౌని అమావాస్య స్నానానికి మేము వెళ్లడం లేదు.. అందువల్ల స్నానాన్ని రద్దు చేసుకున్నాం’ అని ఆయన వెల్లడించారు. సంగం వద్ద జరిగిన దురదృష్టకర సంఘటన, విపరీతమైన రద్దీ కారణంగా అన్ని అఖాడాలు అమృత్ స్నాన్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయని రవీంద్ర పూరి తెలిపారు.
यह खबर बहुत ही दुखद है लगातार एंबुलेंस का सायरन और लोगों की चिक पुकार सुनाई दे रही है...#MahakumbhStampedepic.twitter.com/fxCcr9DPZy
— kp Pathak (@KpPatha19731260) January 29, 2025
‘‘అమృత స్నానానికి రావద్దని అధికార యంత్రాంగం అభ్యర్థించింది.. మేం ప్రస్తుతం అక్కడే ఉన్నాం.., అయితే సాధువులు, నాగ సాధువులతో కూడిన ఊరేగింపు స్నానం కోసం సిద్ధంగా ఉంది.. కానీ ప్రస్తుతానికి దానిని నిలిపివేశామని, మేము త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం’’ అని వివరించారు.
తెల్లవారుజామున 2 గంటల సమయంలో...
కాగా, మౌని అమావాస్యను పురస్కరించుకుని మూడో అమృత స్నానం కోసం పెద్ద సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తరలిరావడంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మోదీ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
🚨Big breaking: प्रयागराज में महाकुंभ मेले में मौनी अमावस्या से पहले संगम नोज पर भगदड़ मचने से 14 लोगों की मौत व कई घायल हो गए है।
— Ramgopal Choudhary (@RamgopalThalor) January 29, 2025
अखाड़ा परिषद ने अमृत स्नान रद्द करने का फैसला लिया है सभी से अपील है की शांति बनाए रखे
क्या यह VVIP कल्चर की वजह से हुआ ?#MahakumbhStampedepic.twitter.com/xhbkEPNsXP
Also Read: U19 Women World Cup: టీ20ల్లో తొలి సెంచరీ నమోదు.. అదరగొట్టిన తెలంగాణ బిడ్డ!
Also Read: Maha Kumbh: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు