/rtv/media/media_files/2025/01/28/D6oGeG87nohjZxIAzhD7.jpg)
ISRO's 100th Rocket GSLV 15
ఇస్రో (ISRO) చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది.శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్..ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.
ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం..ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ది చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ.దీని బరువు 2,250 కిలోలు.ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది.ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్ కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షించారు.
Also Read: Hussain Sagar Boat Fire: హుస్సేన్‌సాగర్‌లో బోటు ప్రమాదం.. అజయ్ మృతదేహం లభ్యం
భౌగోళిక,వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత,విమానాల నిర్వహణ ,మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలందించనుంది.ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు.నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు వివరించారు.ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందిస్తుంది.
విక్రమ్ సారాబాయ్ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగింది. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ది చేశాం. 1979 లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికిల్ ప్రయోగం జరిగింది.
Also Read: Supreme Court: తల్లికి అక్రమ సంబంధం.. తండ్రి ఎవరో తెలుసుకోడానికి కోర్టుకెక్కిన కొడుకు
Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!
100 ప్రయోగాలు..
ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయి. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపాం.3 చంద్రయాన్,మాస్ ఆర్బిటర్,ఆదిత్య,ఎస్‌ఆర్‌ఈ మిషన్లు చేపట్టాం అని నారాయణన్ తెలిపారు.
Also Read: Maha Kumbh: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు