Maha kumbha Mela 2025: మహా కుంభమేళా భక్తులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ పొడగింపు?
ప్రయాగ్ రాజ్ కుంభమేళా ముగింపు తేదీని పొడగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తేదీని పొడిగిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకూ త్రివేణి సంగమంలో 50 కోట్ల మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26 శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుంది.