Kedarnath: కేదార్‌నాథ్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి
ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రలో విషాదం జరిగింది. గౌరీకుండ్ - చిర్బాసా మధ్యలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు.