Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చరియలు..ఆరుగురు మృతి
కొండచరియలు, చెట్లు విరిగి వాహనాలపై పడడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.