Road Accident: ఘోర ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న మాజీ ముఖ్యమంత్రి..
జమ్మూకశ్మీర్లోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్కికి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మెహబూబా ముఫ్తీ క్షేమంగా ఉన్నట్లు ఆమె కూతురు ఇల్తిజా మీడియాకు తెలిపారు.