జమ్మూ కాశ్మీర్లో మంచు సోయగం.. | Jammu and Kashmir Beautiful Places | RTV
ఢిల్లీ, పంజాబ్‌లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 15 లేదా ఒకటి రెండు రోజుల తరువాత అయినా ఈ దాడులు జరిగే అవకాశాలున్నట్లు అధికారులు, నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ నిఘా ఏర్పాటు చేశారు.
జమ్మూ – జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దారి మధ్యలో ఉండగ ఈ ట్రైన్లో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. అయితే ఇది కేవలం బెదిరింపు మాత్రమే అని తర్వాత తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డు పై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు వణకుతున్నాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.అస్సాంలో భారీ వర్షాల వల్ల కజిరంగా నేషనల్ పార్క్‌లోని 131 జంతువులు మృతి చెందగా, 96 జంతువులను కాపాడినట్లు అధికారులు తెలిపారు.
కుమార్తె కనిపించడం లేదని కొద్దిరోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి భీమవరానికి చెందిన శివ కుమారి అనే మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రంగంలోకి దిగిన స్పెషల్ పోలీస్ టీం..యువతిని ఓ యువకుడితో జమ్మూలో గుర్తించి నగరానికి తీసుకుని వస్తున్నారు.
జమ్మూ-కాశ్మీర్‌లోని నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జం మీద ట్రయల్ రన్ నిర్వహించారు. రాంబన్ నుంచి రియాసి స్టేషన్ వరకు ట్రైన్ ఇంజన్‌ను టెస్ట్ చేశారు. ఇది సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. ఈ వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నాడు జమ్మూలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి రూ. 30,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు.విద్యా రంగంలో 13,375 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు