/rtv/media/media_files/2025/05/21/menrU7JkPXONTLdrkh5c.jpg)
Rajiv Gandhi 34th Death Anniversary
1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదర్‌లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురవ్వడం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈరోజు రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి. అయితే రాజీవ్ గాంధీని ఎలా హత్య చేశారు ? ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై ఇలాంటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డారు ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో శ్రీ పెంబుదూర్ అనే ప్రాంతం ఉంది. అక్కడి నుంచి ఇందిరాగాంధీ సన్నిహిత మిత్రురాలు మరకతం చంద్రశేఖర్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పోటీ చేస్తోంది.
రాజీవ్‌ను చూసేందుకు పోటీ
ఆమె తరఫున ప్రచారం చేసేందుకే రాజీవ్ గాంధీ అక్కడికి వెళ్లారు. కానీ జరగబోయే ప్రమాదం గురించి తెలియని ప్రజలు ప్రధాని రాజీవ్‌ను చూసేందుకు భారీ ఎత్తున పోటెత్తారు. ఆ ప్రాంతంలో దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది మోహరించారు. సభ నిర్వహించే స్థలంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్‌కే రాఘవన్ సెక్యూరిటీ ఏరాట్లు పర్యవేక్షిస్తున్నారు. అయితే రాజీవ్ నడవబోయే ఎర్ర తివాచీకి ఇరువైపుల కట్టిన బారికేడ్లు గట్టిగా లేవని తెలిపారు. కానీ ఈ వాదనను స్థానిక నేతలు పట్టించుకోలేదు. జనాన్ని అదుపు చేసే బాధ్యతను మరకతం చంద్రశేఖర్ అసిస్టెంట్ ఏజే దాస్‌కు అప్పగించారు.
Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!
రాజీవ్ గాంధీ వద్దకు ఎవరకి పర్మిషన్ ఇవ్వాలనే లిస్టును ఆయనే చూస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసున్న లతా కణ్నన్.. తక కూతురు కోకిలను కూడా ఆ లిస్టులో చేర్చాలని బతిమిలాడారు. లతా కణ్నన్.. మరకతం కూతురు లతా ప్రియకుమార్ వద్ద పనిచేస్తుండేవారు. లతా కణ్నన్ బతిమిలాడినా కూడా ఏజే దాస్ దీనికి ఒప్పుకోలేదు. చివరికీ లతా ప్రియాకుమార్ చెప్పడం వల్ల రాజీవ్‌కు అభివాదం చేసే వాళ్లలో కోకికలను చేర్చేందుకు అంగీకరించాడు దాస్.
కారులోనే ఇంటర్వ్యూ
ఆరోజు రాత్రి 8.20 PMకి రాజీవ్ మద్రాస్‌లో మీనంబాకం విమానశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి మరకతం చంద్రశేఖర్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు వాళప్పాడి రామ్మూర్తి సహా సెక్యురిటీ సిబ్బందితో కలిసి ఆయన కారులో బయలుదేరారు. కారులోనే న్యూయార్క్ టైమ్స్, గల్ఫ్ న్యూస్ పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చివరికి రాత్రి 10 గంటలకు పెరంబుదూర్‌కు రాజీవ్ చేరుకున్నారు.
గంధపు దండతో యువతి
రాజీవ్‌ను చూసేందుకు అక్కడి ప్రజలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే లతా కణ్నన్ తన కూతురితో పాటు స్టేజీ దగ్గరికి వచ్చింది. కానీ ఇంతలోనే కళ్లద్దాలు పెట్టుకున్న ఓ యువతి గంధపు దండ చేతిలో పట్టుకొని లోపలికి వచ్చింది. మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభలతో కలిసి మహిళా విభాగంలో కూర్చొని ఉంది. మరోవైపు రాజీవ్ ప్రజలకు అభివాదాలు చేస్తూ నడుస్తూ వస్తున్నారు. లత కణ్నన్ తన కూతురు కోకిలను రాజీవ్‌కు పరిచయం చేసింది. అయితే కోకిల వెనుక నిలిచున్న కళ్లాద్దాలు పెట్టుకున్న రాజరత్నం అనే యువతి రాజీవ్ ముందుకు వచ్చేందుకు యత్నించింది. కానీ ఆమెను ఎస్‌ఐ ఆపడంతో నిరాశ చెందింది.
Also Read: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..
పేలిన సూసైడ్ బాంబు
ఆమెను ఎస్‌ఐ వద్దన్నాకూడా రాజీవ్ అంగీకరించారు. దీంతో రాజరత్నం రాజీవ్ వద్దకు వచ్చింది. తాను వెంటతీసుకొచ్చిన గంధపు పూలమాలను రాజీవ్ మెడలో వేసేందుకు యత్నించింది. ఆ దండ వేసుకునేందుకు రాజీవ్ కొద్దిగా తలవంచారు. అంతే ఆయన తలఎత్తేలోపే ఆ యువతి పాధాభివందనం చేస్తున్న అన్నట్లు కిందకు వంగింది. ఆమె సూసైడ్ బాంబుతో రావడం వల్ల ఆ క్షణం ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. దాదాపు 20 అడుగుల ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సూసైడ్ బాంబు మొత్తం ప్రజలు హాహాకారాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ, రాజరత్నంతో పాటు మరో 14 మంది మృత్యువాత పడ్డారు.
రాజీవ్‌ను ఎందుకు చంపారు ?
శ్రీలంకలో సివిల్ వార్ జరగడంతో 1976లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) అనే వేర్పాటువాద సంస్థ ఏర్పడింది. వీళ్లు శ్రీలంకలో ప్రత్యేక తమిళనాడు రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. మొదట్లో ఇందిరాగాంధీ హయాంలో ఈ గ్రూప్‌కు భారత్ నుంచి సపోర్ట్ ఉండేది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రాజీవ్ ప్రధాని అయ్యాక 1987లో భారత్, శ్రీలంక మధ్య శాంతి ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందంలో భాగంగా శ్రీలంక సైన్యానికి మద్ధతుగా వేర్పాటువాద సంస్థ అయిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE)ను అణిచివేయాలని రాజీవ్ గాంధీ.. భారత పీస్ కీపింగ్ ఫోర్స్‌ను పంపించారు. అయితే ఈ బలగాలు శ్రీలంక తమిళులపై దారుణాలకు పాల్పడింది. ఈ కోపంతోనే ఎల్‌టీటీఈ రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు ప్రణాళిక వేసింది. ఎల్‌టీటీఈ సభ్యురాలైన రాజరత్నంతో సూసైడ్ బాంబు ప్లాన్ చేశారు. ఈ ప్రమాదంలోనే రాజీవ్ గాంధీ మరణించారు.
telugu-news | rajiv-gandhi | national-news | Suicide Bomb | tamilnadu